భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తామని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బంగ్లాదేశ్లో హిందువులు, మైనార్టీలపై జరిగిన దాడులను ట్రంప్ ఖండించారు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్లో అమెరికా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులను అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తామన్నారు.