MLG: తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్, సభ్యులు నవంబర్ 2న హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ఉ.10 గంటల నుంచి సా.4 గంటల వరకు అన్ని వర్గాల ప్రజల సమగ్ర సమాచార సేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ జరుపనున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలపై స్వయంగా వెళ్లి సమావేశంలో పాల్గొని వివరించాలన్నారు.