SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలో PM SRI పథకం కింద మంజూరైన భవన నిర్మాణం పనులు త్వరితగతిన చేపట్టాలని ఖేడ్ MLA సంజీవరెడ్డి DEO వెంకటేశ్వర్లను కోరారు. సిర్గాపూర్‌లోని MRCలో వారు సమావేశమై చర్చించారు. 500 విద్యార్థుల సంఖ్యతో ఉన్న స్థానిక హైస్కూల్‌కు ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైసింగ్ ఇండియా (PM-SRI) కింద రూ. 50 లక్షల నిధులు మంజూరయ్యాయని MLA తెలిపారు.