తూర్పు స్పెయిన్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 205కి చేరింది. అనేక మంది గల్లంతయ్యారు. అనేక నగరాలు నీట మునిగాయి. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్లు, శిథిల భవనాల్లోని మృతదేహాలను అధికారులు వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అతిభారీ తుఫాన్లు ఉన్నాయని ఆ దేశ వాతావరణ సంస్థ హెచ్చరికలు జారీ చేస్తోంది.