మార్నింగ్ వాక్ వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పార్కుల్లో, ప్రశాంతమైన వాతావరణంలో వాకింగ్ చేయడం మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది. ఉదయాన్నే శరీరానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందితే.. రోజంతా హుషారుగా గడుస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండటంతోపాటు సృజనాత్మకత పెరుగుతుంది. జీవక్రియల రేటు పెరిగి బరువు కూడా తగ్గుతారు. తెల్లవారుజామున నడకతో శరీరంలోని కొవ్వు కరుగుతుంది.