AP: NTR భరోసా పింఛన్లను మూడో నెలల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చని CM చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి గౌరవంగా పింఛన్ అందించాలని.. ఎవరైనా ఆఫీసు వద్ద ఇస్తే వారి భరతం పడతానని హెచ్చరించారు. గుంతలు లేని రోడ్లు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఇవాళ విజయనగరం జిల్లా పర్యటనకు CM రావాల్సి ఉండగా ఈ కార్యక్రమం రద్దయ్యింది. MLC ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పర్యటన వాయిదా పడింది.