అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సరిహద్దు సమీపంలోని చెక్ పాయింట్ వద్ద ముగ్గురు చైనా సైనికులతో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సంభాషించారు. ‘మీరు సముద్ర మట్టానికి 15వేల అడుగుల ఎత్తున్న ఏరియాలో విధులు నిర్వహిస్తున్నారు కదా.. దీన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు’ అని కిరణ్ అడిగారు. ‘అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో విధులు నిర్వర్తిస్తున్నా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేం చాలా కంఫర్టబుల్గా ఉన్నాం’ అని చైనా సైనికులు చెప్పారు.