గూగుల్ పిక్సెల్ ఫోన్ల అమ్మకాలపై ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ పిక్సెల్ ఫోన్ల అమ్మకాలను నిషేధించింది. iPhone 16 వినియోగాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం ప్రకటించింది. ఆ దేశంలో విక్రయించే స్మార్ట్‌ఫోన్‌ల్లో 40 శాతం స్థానికంగా తయారు చేసిన భాగాలు ఉండాలనే నిబంధన గూగుల్ పాటించలేదని సమాచారం. అయితే, ఇండోనేషియాలో పిక్సెల్ ఫోన్లు అధికారికంగా పంపిణీ చేయబడలేదని గూగుల్ పేర్కొంది.