తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా జపాన్‌లో కూడా సందడి చేసేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 4న జపనీస్ భాషలో ఇది రిలీజ్ కానుంది. ఈ మేరకు ప్రశాంత్ వర్మ సరికొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. అయితే, జపాన్‌లోని కొన్ని థియేటర్లలో ‘హనుమాన్’ తెలుగు వెర్షన్ సైతం జపనీస్ సబ్ టైటిల్స్‌తో స్క్రీనింగ్ కానున్నట్లు తెలుస్తోంది.