తమిళ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అమరన్’. ఈ మూవీ నుంచి సాయి పల్లవి పాత్రకు సంబంధించిన ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆమె ఇందులో ఇందు రేబాక వర్గీస్ అనే పాత్రలో కనిపించనుంది. ఇక రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.