TG: వరద బాధితులకు సహాయార్థం సీఎం సహాయనిధికి హీరో మహేష్ బాబు విరాళం అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.60 లక్షల విరాళం ఇచ్చారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మహేష్ దంపతులు చెక్కు అందజేశారు. సొంత డబ్బులు రూ.50 లక్షలు, AMB తరపున మరో రూ.10 లక్షలు విరాళం అందించారు.