Bali, Nov 15 (ANI): Prime Minister Narendra Modi interacts with his United Kingdom counterpart Rishi Sunak on the first day of the 17th G20 Summit, in Bali on Tuesday. (ANI Photo)
భారత ప్రధాని నరేంద్ర మోదీ…యూకే నూతన ప్రధాని, భారత సంతతి వ్యక్తి రిషి సునక్ తో భేటీ అయ్యారు. యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సునాక్ మొదటిసారిగా ప్రధాని మోడీని కలిశారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్టర్ ద్వారా వెల్లడించింది.గత అక్టోబర్లో ప్రధాని మోడీ, సునాక్ ఫోన్ లో సంభాషించుకున్నారు. కానీ ఇలా ముఖాముఖిగా కలుసుకోవడం మాత్రం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రెండు దేశాల మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందంపై సమతుల్య, సమగ్ర చర్చలపై వారిద్దరు గతంలో చర్చించారు.
ఇది ఇలా వుంటే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు కలుసుకున్నారు. బైడెన్ తో ప్రధాని మోడీ సరదాగా నవ్వుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను పీఎంఓ ట్వీట్ చేసింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యువెల్ మాక్రన్ ను ప్రధాని మోడీ కలుసుకున్నారు. మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మాక్రన్ ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. జీ20 దేశాల రెండు రోజుల సదస్సు ఈరోజు ప్రారంభమైంది.