పర్యావరణ నిబంధనలు పాటించకుండా సరస్సు నిర్మించినందుకు బ్రెజిల్ ఫుట్‌బాల్ ప్లేయర్ నేమార్‌కు కోర్టు రూ. 27 కోట్లకుపైగా జరిమానా విధించింది.
కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నమెంట్ నేటి నుంచి మొదలు కానుంది. ఈ పోటీలో ఇండియా నుంచి ప్రధానంగా పీవీ సింధు, లక్ష్య సేన్ తమ ఫామ్‌ను తిరిగి పొందాలని పోటీలోకి దిగుతున్నారు.
వాట్సప్ లో కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఒరిజినల్ సైజ్, క్వాలిటీ కోల్పోకుండా ఉండే సరికొత్త ఫిచర్ ను వాట్సాప్ పరిచయం చేయబోతుంది.
నేడు (జూలై 3) అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం(International Plastic Free Day). ప్లాస్టిక్ బ్యాగ్‌ల వినియోగాన్ని నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా అవగహన కల్పించడమే దీని లక్ష్యం. ప్లాస్టిక్ సంచులు కిరాణా కొనుగోళ్లకు ఉపయోగకరమైన సౌలభ్యంలా అనిపించవచ్చు. కానీ అవి పర్యావరణంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతాయి. ప్లాస్టిక్ సంచులు కుళ్ళిపోవడానికి 700 సంవత్సరాలు పట్టవచ్చు.
మెక్సికో సిటీ పట్టణ మేయర్ మొసలిని వివాహాం చేసుకున్నారు. తమ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు ఈ ఆచారాన్ని 230 ఏళ్లుగా పాటిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది.
మణిపూర్లో 40 రోజుల నుంచి హింస జరుగుతోందని, ప్రజల వలసలు కొనసాగుతుయని ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ప్రజలు ఇళ్లను వదిలి శిబిరాల్లో నివసిస్తున్నారు. వీటన్నింటి దృష్ట్యా మణిపూర్ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రష్యా అధ్యక్షుడిపై ఉక్రెయిన్ అధ్యక్షకుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మొత్తం పుతిన్ ను చంపాలని చూస్తోందని ఆరోపించారు. ఇప్పటికే 21000 వేల మంది రష్యా సైన్యాన్ని హతమార్చామని ప్రకటించారు.
ఫ్రాన్స్ లోని ప్యారిస్ అంతా ఆందోళనకారులతో హోరెత్తిపోతోంది. నిరసనకారుల ఆవేశానికి నగరంలోని షాపింగ్ మాల్స్, వాహనాలు దగ్ధం కాగా, 1300 పైగా అరెస్టులు చేసినా అల్లర్లు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.
సోషల్ మీడియా ట్విట్టర్ సేవలు నిలిచిపోయాయి. వెబ్ సైట్, యాప్‌లో కూడా ట్విట్టర్ పని చేయడం లేదు.
ఫ్రాన్స్ లో 17 యువకుడి మృతికి సంబంధించిన ఆందోళనలు. మొహరించిన బలగాలు. ఆధ్యక్షుడి వీడియో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున నెటిజనుల విమర్షలు.
బస్టాప్‌లో ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి ఓ లారీ దూసుకెళ్లడంతో 48 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరికొంత మందికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు.
ఇప్పుడు ప్రజలకు నవ్వడానికి సమయం లేదు. అందరూ పని కోసం పరుగులు తీస్తున్నారు. కనీసం కాసేపు కూడా మనసు విప్పి నవ్వుకోవడం లేదు. మరికొందరు బలవంతంగా నవ్వుతూ నవ్వుల సమావేశాల్లో పాల్గొంటారు.
ఫ్రాన్స్‌లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు యువకుడిని పోలీసులు కాల్చిచంపారు.
2000 సంవత్సరాల క్రితం కూడా ప్రజలు పిజ్జా తినేవారని శాస్త్రవేత్తలు తెలిపారు. త్రవ్వకాలలో లభించిన ఆధారాల ఆధారంగా శాస్త్రవేత్తలు అలాంటి వాదనను వినిపించారు.
ఎవరెంత మద్యం తాగుతారో అని పోటీలు పెట్టుకుని మరీ తాగుతున్నారు. కానీ అలాంటి పోటీ పెట్టుకుని ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఒక బ్రిటీష్ వ్యక్తి 21 కాక్టెయిల్స్ తాగాలని పందెం వేసి, 12 కాక్టెయిల్స్ తాగి చనిపోయాడు.