బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనమ్ కపూర్ ఇటీవల ఓ అరుదైన ఘనత దక్కింది.బ్రిటన్ రాజు ఛార్లెస్-3 పట్టాభిషేకానికి ఆహ్వానం అందుకుంది. ఏ బాలీవుడ్ నటికి దక్కని గౌరవం ఆమెకు దక్కింది. కాగా, తాజాగా ఆమెకు మరో అరుదైన ఆహ్వానం అందుకుంది.
మీరు ఆన్ లైన్ గేమ్స్ ఆడుతారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే త్వరలోనే యూట్యూబ్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడేందుకు అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే YouTube "ప్లేబుల్స్" ఆ ఫీచర్‌ని పరీక్షిస్తున్నట్లు ప్రకటించారు. ఇది త్వరలోనే వినియోగదారులకు నేరుగా అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
మంగళవారం జరిగిన SAFF ఛాంపియన్‌షిప్(SAFF Championship 2023)లో తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో 1-1 డ్రాతో భారత్(India) కువైట్(Kuwait)తో డ్రాగా ముగిసింది. మొదటి అర్ధభాగంలో ఛెత్రి ఇంజురీ-టైమ్ స్ట్రైక్‌తో భారత్‌ను విజయపథంలోకి నెట్టాడు. కానీ సెకండ్ హాఫ్ అదనపు సమయంలో అన్వర్ అలీ చేసిన సెల్ఫ్ గోల్ ఆతిథ్య జట్టును దెబ్బతీసింది.
పాపులర్ ఆర్టిఫిషియల్ స్వీటెనర్‌లు(artificial sweetener) ఉపయోగిస్తున్నారా? అయితే చాలా డేంజర్ అని ఓ సర్వే చెబుతోంది. స్వీటెనర్‌లు ఉపయోగించే ఓ వ్యక్తి DNAను దెబ్బతీస్తుందని, క్యాన్సర్‌కు దారితీస్తుందని కొత్త పరిశోధన వెల్లడించింది. అయితే ఇది టేబుల్ షుగర్ కంటే 600 రెట్లు తియ్యగా ఉంటుందని తేలింది. అంతేకాదు కాల్చిన వస్తువులు, పానీయాలు, చూయింగ్ గమ్, జెలటిన్‌లు, ఇది ఉపయోగించబడుతున్నట్లు వెలుగులోకి వచ్చి...
నాసా శాస్త్రవేత్తలు చేసిన మరో ప్రయోగం సక్సెస్ అయ్యింది. మూత్రం, చెమట నుంచి మంచినీటిని తయారు చేసే విధానం సక్సె అయ్యిందని నాసా ప్రకటించింది. దీని వల్ల భవిష్యత్ తరాలకు నీటి సమస్య తీరుతుందని తెలిపింది.
ఎట్టకేలకు ICC ODI ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. టోర్నమెంట్ ప్రారంభానికి సరిగ్గా 100 రోజుల ముందు షెడ్యూల్‌ను జూన్ 27 (నేడు) రిలీజ్ చేసింది. ODI ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఇండియాలో జరగనుంది.
దీపావళి రోజున స్కూళ్లకు సెలవు ఇవ్వాలనే డిమాండ్‌కు న్యూయార్క్ గవర్నర్ ఆమోదం తెలిపారు. వచ్చే ఏడాది నుంచి దీపావళి రోజున స్కూళ్లకు సెలవు ఇవ్వనున్నారు.
రష్యాలో పుతిన్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్ ప్రాణ భయంతో బెలారస్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ చీఫ్ డేవిడ్ పెట్రాయస్ కీలక విషయాన్ని సూచించాడు. పుతిన్ పగబట్టిన పాము కంటే చాలా డేంజర్ అని, ప్రిగోజిన్ జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.
యూఏఈకి చెందిన లులూ గ్రూప్(Lulu Group) తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, రిటైల్ అవుట్‌లెట్లలో రూ.3,500 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు ప్రకటించింది.
చైనాకు చెందిన బైడు కంపెనీ ఎర్నీ బాట్ చాట్ జీపీటీని ఆవిష్కరించింది. లాంచింగ్ కార్యక్రమంలోనే నెగిటివ్ వచ్చింది. ఎక్కువ మంది లేకపోవడం, ప్రీ రికార్డెడ్ వీడియోలు పొందుపరచడంతో నెగిటివ్ వెళ్లింది. దీంతో ఆ కంపెనీ షేర్లు పడిపోయాయి.
ప్రముఖ పశుపతినాథ్ ఆలయం(pashupatinath temple)లో 10 కిలోల బంగారం మాయమైనట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అసలు ఏలా పోయిందనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ప్రఖ్యాత చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ యూనిహెర్ట్జ్ 3 అంగుళాల డిస్‌ప్లే, పారదర్శక డిజైన్‌తో ‘జెల్లీ స్టార్’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ సరికొత్త ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫోన్ ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది.
2017లో కొత్త మెంటల్ హెల్త్‌కేర్ యాక్ట్ ఆమోదించబడిన తర్వాత భారతదేశంలో జరిగిన మొదటి సర్జరీ ఇది. కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారం.. రోగి సమ్మతి తెలిపినా.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర మానసిక ఆరోగ్య బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే సైకో సర్జరీని నిర్వహించవచ్చు.
లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగదారులు ధైర్యంగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారు. ఈ-కామర్స్ కంపెనీలపై పెరిగిన నమ్మకం.. అవి అందించే సేవలు, కస్టమర్ సపోర్ట్ ఇందుకు కారణమని చెప్పవచ్చు.
రష్యాలో వాగ్నర్ తిరుగుబాటు తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. మాస్కోలో ఎమర్జెన్సీ విధించారు. అక్కడి ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. మాస్కోలో సోమవారాన్ని 'నాన్ వర్కింగ్ డే'గా ప్రకటించారు.