»Sonam Kapoor Invited For Uk Pm Rishi Sunaks Reception To Mark Uk India Week
Sonam Kapoor: యూకే ప్రధాని నుంచి సోనమ్ కి ఆహ్వానం ఎందుకో తెలుసా?
బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనమ్ కపూర్ ఇటీవల ఓ అరుదైన ఘనత దక్కింది.బ్రిటన్ రాజు ఛార్లెస్-3 పట్టాభిషేకానికి ఆహ్వానం అందుకుంది. ఏ బాలీవుడ్ నటికి దక్కని గౌరవం ఆమెకు దక్కింది. కాగా, తాజాగా ఆమెకు మరో అరుదైన ఆహ్వానం అందుకుంది.
బాలీవుడ్ (Bollywood)లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి అలరించిన సోనమ్(Sonam Kapoor), 2018 లో పెళ్లి చేసుకుని..ఫ్యామిలీతో లండన్ లో ఉంటోంది. పెద్దగా సినిమాలవైపు చూడటంలేదు. లండన్ లో తన భర్త ఆనంద్ అభుజా, తన కొడుకుతో సమయం గడుపుతోంది. అయితే, ఈ మక్రమంలో ఆమెకు యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ నుంచి ఆమెకు ఆహ్వానం అందింది. UK-ఇండియా వీక్ 2023 సందర్భంగా జరగబోయే రిసెప్షన్ కోసం నటి సోనమ్ కపూర్(Sonam Kapoor)ను యునైటెడ్ కింగ్డమ్ ప్రధాన మంత్రి రిషి సునక్ ఆహ్వానించారు. సోనమ్ తన భర్త-బిజినెస్మెన్ ఆనంద్ అహుజా, వారి కుమారుడు వాయుతో కలిసి లండన్‌లో నివసిస్తున్నారు. కాగా, ఆమె భారతదేశం తరపున హాజరవుతున్నారు.
10 డౌనింగ్ స్ట్రీట్‌లోని ప్రధానమంత్రి అధికారిక నివాసం, కార్యాలయంలో జరిగే రిసెప్షన్లో ఆమె కనిపిస్తుంది. జూన్ 26 నుండి జూన్ 30 వరకు లండన్‌లో జరుగుతున్న ఇండియా గ్లోబల్ ఫోరమ్ ఫ్లాగ్షిప్ ఈవెంట్ UK-ఇండియా వారంలో ఈ వేడుక ఒక భాగం. సోనమ్(Sonam Kapoor) బుధవారం రిసెప్షన్‌కు హాజరవుతుంది. అక్కడ ఆమె భారత దేశ సాంస్కృతిక సంప్రదాయాల గురించి మాట్లాడనున్నారు. ఇదిలా ఉంటే సోనమ్ త్వరలో బ్లైండ్ అనే చిత్రంలో నటించారు. షోమ్ మఖిజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పురబ్ కోహ్లి, వినయ్ పాఠక్ , లిల్లేట్ దూబే కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్గా రివీల్ చేసిన ఫస్ట్‌లుక్ ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. UKలో మహమ్మారి సమయంలో సోనమ్ ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. జూలై 7న OTT ప్లాట్‌ఫారమ్ Jio సినిమాస్‌లో బ్లైండ్ ప్రీమియర్ ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది.