man spends 2 million dollars per year to become young
ఎవ్వరికైనా యవ్వనం అనేది చాలా ముఖ్యమైన దశ. యంగ్ గా ఉన్నప్పుడే చాలా అందంగా కనిపిస్తాం కానీ.. ఆ యవ్వనం ఎక్కువ రోజులు ఉండదు. వయసు 30 దాటిందంటే అంతే.. యవ్వనం పోయి వయసు మీదపడినట్టుగా కనిపిస్తుంది. వయసు మీద పడుతున్న కొద్దీ వయసు మళ్లిన వాళ్లలా కనిపిస్తాం. యంగ్ గా కనిపిస్తేనే కదా అమ్మాయిలు కూడా చూసేది. ముసలివాళ్లను ఎవరు చూస్తారు. అందుకే కాబోలు 45 ఏళ్ల ఓ వ్యక్తి 18 ఏళ్ల కుర్రాడిలా కనిపించడానికి చాలా కష్టాలు పడుతున్నాడు. చివరకు అతడికి ఒక సొల్యూషన్ కూడా దొరికింది. యంగ్ గా కనిపించడం కోసం సంవత్సరానికి అతడు రూ.16 కోట్లు ఖర్చు పెడుతున్నాడు.
అతడి పేరు బ్రియాన్ జాన్ సన్. వ్యాపారవేత్త. చేతుల్లో బాగా డబ్బు ఉంది. కానీ.. అనుభవిద్దామంటే వయసు చకచకా వెళ్తోంది. చూడటానికి యంగ్ గా కనిపించకపోవడం వల్ల బాధగా అనిపించిందో ఏమో.. ఏకంగా 30 మంది డాక్టర్లను, ఆరోగ్య నిపుణులను పనిలో పెట్టుకొని మరీ సంవత్సరానికి రూ.16 కోట్లు ఖర్చు చేస్తూ 18 ఏళ్ల యువకుడిలా కనిపిస్తున్నాడు. దాని కోసం అత్యంత ఖరీదైన మెడికల్ ట్రీట్ మెంట్ ను అతడికి చేస్తున్నారు. మన శరీరంలో ఉండే ప్రతి అవయం రోజులు గడుస్తున్న కొద్దీ దాని పనితీరు నెమ్మదిస్తూ ఉంటుంది. దాని పనితీరు నెమ్మదించకుండా ప్రతి అవయవాల ఏజింగ్ ప్రాసెస్ ను రివర్స్ చేస్తున్నారు. దీంతో ఆయన వయసు పెరుగుతున్నా శరీరంలో మాత్రం అలాంటిదేమీ కనిపించదు. యువకుడిగా కనిపిస్తాడు. అతడి శరీరంలోని ప్రతి అవయవం 18 ఏళ్ల యువకుడిలా పని చేయడం కోసం భారీ స్థాయిలో ఖర్చు పెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.