Plane Crash: తూర్పు ఆఫ్రికా దేశం మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ చిలిమా విమాన ప్రమాదంలో మరణించారు. అతనితోపాటు విమానంలో మరో తొమ్మిది మంది ఉన్నారు. దక్షిణాఫ్రికా దేశ రాజధాని లిలాంగ్వే నుంచి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.17 గంటలకు విమానం బయలుదేరింది. సరిగ్గా 45 నిమిషాల తర్వాత చేరుకోవాల్సి ఉందని అధ్యక్షుడు లాజరస్ చక్వేరా తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఎయిర్పోర్ట్ అథారిటీ విమానాన్ని తిరిగి రావాలని ఆదేశించింది. ఆ తర్వాత ఎయిర్ ట్రాఫిక్ అథారిటీ విమానంతో సంబంధాలు కోల్పోయింది.
ఆ తర్వాత విమానం కోసం పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. గంటల తరబడి సెర్చ్ ఆపరేషన్ తర్వాత చికన్‌గావా అడవుల్లోని పర్వతాల్లో విమాన శకలాలు లభ్యమయ్యాయి. విమానంలో ఉన్న మొత్తం 10 మంది మరణించారని అధ్యక్షుడు లాజరస్ చక్వేరా తెలిపారు.
సౌలోస్ చిలిమా మృతికి సంతాపం
మలావి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో , వైస్ ప్రెసిడెంట్, గౌరవనీయ డాక్టర్. సౌలోస్ క్లాస్ చిలిమా ప్రయాణిస్తున్న విమానం ఈ ఉదయం చికంగవా అడవిలో కనుగొన్నాం. దురదృష్టవశాత్తు విమానంలో ఉన్న వారంతా మరణించారు. అధ్యక్షుడు జాతీయ సంతాప దినాన్ని ప్రకటించారు. ఈ రోజు నుండి అంత్యక్రియలు జరిగే రోజు వరకు అన్ని జెండాలను సగం మాస్ట్‌లో ఎగురవేయాలని ఆదేశించారు.
BREAKING NEWS:
Malawi Vice President Saulos Chilima and 9 others confirmed dead in a plane crash.
The plane has been found and all 10 on board are dead!
Deepest condolences to the Government of Malawi, VP Chilima family (VP and his wife were on board) and the families of the… pic.twitter.com/upSTE63aT2
2014 నుంచి ఉపాధ్యక్షుడి పదవిలో
చిలిమా 2014 నుండి మలావి వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. గతంలో మొబైల్ నెట్వర్క్ ఎయిర్టెల్ మలావికి నాయకత్వం వహించాడు. యునిలివర్, కోకా-కోలా , కార్ల్స్బర్గ్లతో కూడా పనిచేశాడు.
నెల వ్యవధిలో రెండో ప్రమాదం
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కూడా హెలికాప్టర్ కుప్పకూలడంతో మరణించారు. ఆయన హెలికాప్టర్‌లోని మొత్తం తొమ్మిది మంది చనిపోయారు. ప్రతికూల వాతావరణం కూడా ఈ ఘటనకు కారణమని చెబుతున్నారు. ఇప్పుడు నెల రోజుల్లోనే మరో దేశ నాయకుడు విమాన ప్రమాదంలో చనిపోయాడు. మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ చిలిమా విమానం కూడా ప్రతి కూల వాతావరణం కారణంగా ప్రమాదానికి గురైంది.