అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌ను తుపాకీ కేసులో కోర్టు దోషిగా తేల్చింది. దీంతో కోర్టు తీర్పును తాను అంగీకరిస్తున్నానని జో బైడెన్ వెల్లడించారు. క్షమాభిక్ష కోరబోనని తెలిపారు.
Hunter Biden Case : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ తుపాకీ కొనుగోలు కేసులో దోషిగా తేలారు. ఆయన తుపాకీ కొనుగోలు సమయంలో తప్పుడు సాక్ష్యాలు ఇచ్చినట్లు విచారణలో నిర్ధారణ అయ్యింది. మంగళవారం డెలావర్‌లోని విల్మింగ్టన్ కోర్డు జడ్జి మేరీ ఎల్లెన్ నోరీకా హంటర్ దోషి అని తేలుస్తూ తీర్పును వెల్లడించారు. అయితే ఇంకా ఎలాంటి శిక్ష వేసిందీ వెల్లడించలేదు.
తీర్పును వెల్లడించిన తర్వాత హంటర్ బైడెన్(HUNTER BIDEN) భావోద్వేగానికి గురయ్యారు. అక్కడున్న తన భార్యను, తన లాయర్ని కౌగిలించుకుని తర్వాత వారితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడలేదు. ఈ విషయమై జో బైడెన్ సైతం స్పందించారు. తీర్పును తాను అంగీకరిస్తున్నట్లు తె లిపారు. ఎలాంటి క్షమాభిక్షా కోరబోనని తెలిపారు.
హంటర్ బైడెన్ 2018లో తుపాకీ(GUN) కొనుగోలు కోసం ఆయుధ డీలర్‌కు అప్లికేసన్ పెట్టుకున్నారు. ఆ అప్లికేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చరు. తన వద్ద అక్రమ ఆయుధాలు లేవని, తాను డ్రగ్స్‌కి బానిస కాదని వెల్లడించారు. అయితే విచారణలో ఆ సమాచారం అంతా తప్పని తేలింది. అప్పటికే హంటర్ అక్రమంగా డ్రగ్స్ కొంటున్నట్లు తెలిసింది. అలాగో మరో 11 రోజుల పాటు ఆయనకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ గన్ కూడా ఉన్నట్లు తేలింది. దీంతో కోర్టు ఆయన్ను దోషిగా తేల్చింది. సాధారణంగా ఇలాంటి నేరాకు గరిష్ఠంగా 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కానీ మొదటి సారి ఇలాంటి నేరం చేసిన వారికి శిక్షా కాలంలో, శిక్షలో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది.