»Daughter Killed Father Who Was Raping Her For Three Months
Pakistan: 3నెలలుగా అత్యాచారం.. తట్టుకోలేక తండ్రిని కాల్చి చంపిన కూతురు
పాకిస్థాన్‌లో ఓ కూతురు తన తండ్రిని కాల్చి చంపింది. పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మూడు నెలలుగా తండ్రి తనపై అత్యాచారం చేస్తున్నాడని కూతురు ఆరోపించింది. తట్టుకోలేక కాల్చడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.
Pakistan: పాకిస్థాన్‌లో ఓ కూతురు తన తండ్రిని కాల్చి చంపింది. పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మూడు నెలలుగా తండ్రి తనపై అత్యాచారం చేస్తున్నాడని కూతురు ఆరోపించింది. తట్టుకోలేక కాల్చడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాకిస్థాన్‌లోని లాహోర్‌లోని గుజ్జర్పురాలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల విచారణలో.. తన తండ్రి మూడు నెలలుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని, అందుకే తన తండ్రిని చంపేశానని బాలిక చెప్పింది. బాలిక పరిస్థితి విషమంగా ఉందని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి సోహైల్ కజ్మీ తెలిపారు. ఆమె జీవితాన్ని తండ్రి నరకప్రాయం చేశాడు. దీంతోనే చివరకు తండ్రిని చంపాలని నిర్ణయించుకుంది.
బాలిక తన తండ్రి సొంత తుపాకీతో కాల్చి చంపిందని పోలీసు అధికారి సోహైల్ కజ్మీ తెలిపారు. కాల్పులు జరపడంతో బాలిక తండ్రి అక్కడే మరణించాడని చెప్పాడు. ఇటీవల మైనర్ కూతురిపై అత్యాచారం చేసిన ఓ తండ్రికి పాకిస్థాన్ కోర్టు మరణశిక్ష విధించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అత్యాచార ఘటన వెలుగులోకి రావడంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. లాహోర్‌లోని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ మియా షాహిద్ జావేద్ మహ్మద్ రఫీక్‌కు మరణశిక్ష విధించారు. ఆగస్టు నెలలో ఓ వ్యక్తి తన 10 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేశాడు. పదేళ్ల కొడుకుపై తండ్రి అత్యాచారం చేసి పరారీలో ఉన్నాడు. ఆ బాలుడు మృతి చెందాడు. దీని తర్వాత ఆ కసాయి తండ్రి కనిపించకుండా పోయాడు. అతని కోసం పోలీసులు నిరంతరం వెతుకుతున్నారు. నిందితుడు తండ్రి తర్వాత దేశం విడిచి పారిపోయాడు. పాకిస్థాన్ పోలీసులు అతని కోసం విదేశాల్లో కూడా వెతుకుతున్నారు. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని నిందితులుగా చేర్చారు.