Covid 19 : అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న కోవిడ్‌ కొత్త వేరియెంట్‌

కోవిడ్‌ 19 కొత్త వేరియంట్‌ అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది. దీని విషయంలో అంతా భయాందోళనలకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - May 6, 2024 / 12:46 PM IST

Covid 19 New Flirt Variant : కోవిడ్‌ షాక్‌ల నుంచి అంతా కోలుకుని సాధారణ జీవనంలోకి వచ్చారు. అయితే ఇప్పుడు అమెరికాలో వెలుగు చూసిన ఓ కొత్తరకం కోవిడ్‌ వేరియంట్‌ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇది టీకాలకు సైతం లొంగదని, రోగనిరోధక శక్తి పని చేయదని వార్తలు వెలువడుతున్నాయి. ఈ కొత్త వేరియంట్‌ని ఫ్లిర్ట్‌ వేరియంట్‌ అని పిలుస్తున్నారు.

చదవండి : తీవ్ర నీటి కొరత… అక్కడ కార్‌ వాష్‌లపై బ్యాన్‌!

ప్రస్తుతం అమెరికాలో ఈ ఫ్లిర్ట్‌ వేరియంట్‌(Flirt Variant) వల్ల జనం ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా అక్కడ ఈ కేసులు అధికం అవుతున్నాయి. ఈ స్ట్రెయిన్‌ ఒమిక్రాన్‌ కుటుంబానికి చెందినది. ఒమిక్రాన్‌ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయో మనందరికీ తెలిసిందే. ఈ కుటుంబానికి చెందిన సబ్‌ వేరియంట్‌గా ఫ్లిర్ట్‌ని(Flirt) చెబుతున్నారు. ఈ వేరియంట్‌ కేసులు ఇప్పుడు అమెరికాలో ఎక్కువగా విస్తరిస్తున్నాయి. బూస్టర్‌ డోసులు తీసుకున్న వారికి కూడా ఇది సంక్రమించే అవకాశం ఉందట. వేడి వల్ల ఈ కేసులు ఎక్కువ పెరిగే అవకాలూ లేకపోలేదు.

చదవండి :  మంత్రి పీఏ.. పని మనిషి ఇంట్లో కోట్ల నోట్ల కట్టలు సీజ్‌!

అమెరికాలోని వ్యర్థ జలాల్ని పరీక్షించినప్పుడు ఈ వేరియంట్‌ని శాస్త్రవేత్తలు గుర్తించారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, షుగర్‌, గుండె జబ్బుల్లాంటి ఉన్న వారు ఈ వేరియంట్‌ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, జలుబు, కండరాల నొప్పి, జీర్ణ సమస్యలు, రుచి కోల్పోవడం లాంటివి ఇది సంక్రమించిన వారిలో కనిపిస్తాయని చెబుతున్నారు.

Related News

Health benefits: ఆలివ్స్ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

ఆలివ్స్ శతాబ్దాలుగా మధ్యధరా ప్రాంతంలో ఆహారంలో భాగంగా ఉన్నాయి. వీటి రుచి కారణంగానే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు. ఆలివ్స్ లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు , ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.