Chicken prices : చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు..! : చికెన్ ప్రియులకు షాక్. చికెన్ ధర అమాంతం పెరిగిపోయింది. కిలో చికెన్ ధర ఏకంగా రూ. 720కి చేరుకుంది. అమ్మో... ఇంత రేటు అయితే... చికెన్ ఎలా తింటాం అని భయపడుతున్నారా..? కంగారుపడకండి.
చికెన్ ప్రియులకు షాక్. చికెన్ ధర అమాంతం పెరిగిపోయింది. కిలో చికెన్ ధర ఏకంగా రూ. 720కి చేరుకుంది. అమ్మో… ఇంత రేటు అయితే… చికెన్ ఎలా తింటాం అని భయపడుతున్నారా..? కంగారుపడకండి. ఈ ధర మన దగ్గర కాదు.. ఇదంతా పాకిస్థాన్‌లో పరిస్థితి. దీంతో అక్కడి చికెన్ ప్రియులు అల్లాడిపోతున్నారు. ఒక్క లాహోర్‌లో మాత్రం రూ. 550 వరకు ఉండటం కొంచెం ఊరట కలిగించే విషయం కావడం గమనార్హం.
కరాచీలో కేజీ చికెన్ ధర ప్రస్తుతం రూ. 720కి పెరిగింది. ఇస్లామాబాద్, రావల్పిండి ఇతర నగరాల్లో రూ.700-705 వరకు పలుకుతోంది. చికెన్ ధరల పెరుగుదలకు ఆర్థిక సంక్షోభమే కారణమని తెలుస్తోంది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పాక్‌లో పౌల్ట్రీ వ్యాపారాలు మూతపడ్డాయని పలు నివేదికలు చెబుతున్నాయి.
కోళ్ల ఫీడ్ తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో కోళ్ల పోషణ ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో దేశంలో చాలా వరకు పౌల్ట్రీ వ్యాపారాలు మూత పడ్డాయి. చికెన్ ధరలు ఆకాశాన్ని అంటడంతో చికెన్‌ను తినలేకపోతున్నామని చికెన్ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో పాక్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. చికెన్ ధరలను అదుపు చేసేందుకు చర్యలు చేపడుతోంది. కోళ్ల దాణా సమస్యకు గల కారణాలపై విచారణ చేపట్టింది. దాణా సమస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది.