»America 7 People Killed In Two Shootings In Birmingham Nightclub And Indian Summer Drive
America Shooting: అమెరికాలో కాల్పులు.. ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి మృతి..9మందికి గాయాలు
అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లోని నైట్‌క్లబ్‌లో శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, 9 మంది గాయపడ్డారు. నగరంలోని ఒక ఇంటి వెలుపల కాల్పులు జరిపిన సంఘటనలో ఒక చిన్న పిల్లవాడు సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు.
America Shooting: అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లోని నైట్‌క్లబ్‌లో శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, 9 మంది గాయపడ్డారు. నగరంలోని ఒక ఇంటి వెలుపల కాల్పులు జరిపిన సంఘటనలో ఒక చిన్న పిల్లవాడు సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. 27వ స్ట్రీట్ నార్త్ 3400 బ్లాక్‌లోని నైట్‌క్లబ్ వెలుపల ఈ సంఘటన జరిగిందని బర్మింగ్‌హామ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ట్రూమాన్ ఫిట్జ్‌గెరాల్డ్ తెలిపారు. కాల్పుల సమాచారం అందుకున్న అధికారులు రాత్రి 11 గంటలకు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా నలుగురు మృతి చెందారు.
సమాచారం అందుకున్న బర్మింగ్‌హామ్ ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని నైట్‌క్లబ్‌లో ఇద్దరు మహిళలు చనిపోయినట్లు ప్రకటించారని పోలీసు అధికారి ఫిట్జ్‌గెరాల్డ్ తెలిపారు. కాగా క్లబ్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఒకరు శవమై కనిపించారు. రెండవ వ్యక్తి బర్మింగ్‌హామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కాల్పుల్లో 9 మంది గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కనీసం ఒక అనుమానితుడు వీధిలో ఉన్న నైట్‌క్లబ్‌లోకి కాల్పులు జరిపాడని పరిశోధకులు విశ్వసిస్తున్నారని ఫిట్జ్‌గెరాల్డ్ చెప్పారు. ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తులో బర్మింగ్‌హామ్ పోలీసులకు సహాయం చేస్తున్నారు.
బర్మింగ్‌హామ్‌లోని ఒక ఇంటి వెలుపల కాల్పుల సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన బర్మింగ్‌హామ్‌లోని ఇండియన్ సమ్మర్ డ్రైవ్‌లోని 1700 బ్లాక్‌లో సాయంత్రం 5:20 గంటలకు జరిగింది. ఇంటి బయట వాహనంపై కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఓ వ్యక్తి, మహిళ, 5 ఏళ్ల వయస్సు ఉన్న చిన్న పిల్లవాడు ఉన్నారు. ఈ విషయంలో స్థానికుల సహాయం కోరుతున్నామని, ఇంటి బయట అమర్చిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.