»A Study By The Mckinsey Global Institute In America Says That Artificial Intelligence Poses A Huge Threat To Womens Jobs
AI: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో మహిళ ఉద్యోగాలకు భారీ ముప్పు?
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో రాబోవు రోజుల్లో పలు విభాగాల్లో ఉద్యోగాలకు ముప్పువాటిల్లనుండగా, అందులో మహిళా ఉద్యోగులకే ఎక్కవ నష్టం కలుగుతుందని అమెరికాలోని ఓ రిసేర్చ్ నివేదిక తేల్చింది.
A study by the McKinsey Global Institute in America says that artificial intelligence poses a huge threat to women's jobs.
AI: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(Artificial intelligence) చేస్తున్న అద్భుతాలను చూపి అబ్బురపడుతున్న వారే దాని మూలన ఏర్పడే పరిణామాలకు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ సాంకేతికత(Technology)తో రాబోవు రోజుల్లో ఉద్యోగా(jobs)ల్లో కోత తప్పదన్న భయం అందరిలో నెలకొంది. తాజా ఆధ్యాయనం ప్రకారం ఈ విషయంలో మహిళలకే ఎక్కువ ముప్పు ఉందని తేలింది. అమెరికాలో ఓ సంస్థ జరిపిన పరిశోధనలో ఏఐతో మహిళల అధికంగా ప్రమాదం ఉందని, 2030 నాటికల్లా మహిళలకు పరిమితమైన చిన్న చిన్న ఉద్యోగాల్లో మెజారిటీ కృతిమ మేధతో భర్తీ చేస్తారని అంచనా. ప్రస్తుతం ఉద్యోగాలు చేసే వారిలో పురుషులే అధికంగా ఉన్నారు. కానీ ఈ టెక్నాలజీలో మేల్ కంటే ఫీమేల్స్ 21 శాతం అధికంగా ఉద్యోగాలు కోల్పోతారని మెకిన్సీ గ్లోబల్ ఇన్స్టిట్యూట్(McKinsey Global Institute) తన అధ్యయనంలో పేర్కొంది.
మహిళలు చేసే ఉద్యోగాల్లో ఎక్కువగా సేల్స్ పర్సన్స్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు, క్యాషియర్ వంటివి ఉంటాయి. అయితే ఈ కృత్రిమ మేథ సాంకేతికత సులువుగా ఆ పనులను చేసేస్తుందని చెప్పింది. అమెరికాలో ఏఐని వాడడం మొదలు పెట్టారు. కాబట్టి ముందుగా అక్కడి వారిలో భారీ తొలగింపులు జరుగుతాయని భయపడుతున్నారు. అయితే దీనికి పరిష్కారంగా ఆయా సంస్థలు సర్టిఫికేట్ల బదులు వ్యక్తుల ప్రతిభ ఆధారంగా ఉద్యోగాల్లో నియామకాలు చేబట్టాలని ఈ నివేదికలో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల వారు, వికలాంగులు, నిర్లక్ష్యానికి గురైన ఇతర వర్గాలకు తగిన శిక్షణ ఇచ్చి పనుల్లోకి తీసుకోవడంపై దృష్టి సారించాలని తెలిపారు. నిరుద్యోగులుగా మిగలకుండా ఉండాలంటే కొత్త అవిష్కారణల పట్ల అప్రమత్తంగా ఉంటూనే, ట్రెండ్‌కు తగ్గట్లు నైపుణ్యాన్ని అభివృద్ధి పరుచుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఏఐ(Artificial intelligence )తో ఉద్యోగాలకు కొరత ఏర్పడే అవకాశం ఉండదు. దీని మూలన మరిన్ని కొత్త జాబ్స్ పుట్టుకొస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.