Water Melon: కల్తీ పుచ్చకాయను గుర్తించడం ఎలా?

వేసవి కాలం వచ్చిందంటే ఎక్కువగా పుచ్చకాయలకు డిమాండ్ ఉంటుంది. అయితే ఈరోజుల్లో కొంతమంది లాభాలు ఆర్జించాలని కొన్ని రసాయనాలు కలుపుతుంటారు. ఇలాంటి పుచ్చకాయలు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి రసాయనాలు కలిపిన పుచ్చకాయను గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - April 26, 2024 / 04:15 PM IST

Water Melon: పుచ్చకాయ ఆరోగ్యానికి చాలామంచిది. ఇందులో నీటి ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయలో క్యాన్సర్‌‌తో పోరాడే గుణాలు ఉంటాయి. గుండె, కళ్లకు చాలా మంచిది. అయితే ఇవి త్వరగా పండి, ఎక్కువ రోజులు పాడవకుండా ఉండటానికి రసాయనాలు కలుపుతారు. అలాగే పుచ్చకాయ లోపలి భాగం ఎర్రగా ఉండాలని వీటికి ఇంజెక్షన్లు కలుపుతారు. చూడటానికి చక్కగా ఉంటాయి. కానీ వీటికి రుచి ఉండదు. వీటిని సరిగ్గా గమనిస్తే రసాయనాలు కలిపారో లేదో తెలుసుకోవచ్చు. పుచ్చకాయను కట్ చేసినప్పుడు గుజ్జు పగిలిపోయి రంగుల్లో తేడా ఉంటుంది.

ఇది కూడా చూడండి: Teja Sajja: తెలంగాణ‌ గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన హనుమాన్ హీరో, డైరెక్ట‌ర్

కోసినప్పుడు విడిపోత ఆ పుచ్చకాయలో కెమికల్ కంటెంట్ ఉన్నట్లే. అలాగే పుచ్చకాయ పండ్లపై తెల్లటి మచ్చలు కనిపిస్తే అది కల్తీ అనుకోవాలి. చేతులతో తాకితే పౌడర్ అంటుకుంటే వీటిని కొనవద్దు. రసాయనాల వల్ల పండిన పుచ్చకాయ గింజలు చాలా చిన్నవిగా ఉంటాయి. సహజంగా పండే పుచ్చకాయ గింజలు అయితే నల్లగా, పెద్దవిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు రక్తహీనత, మెదడు దెబ్బతినడం, సంతానోత్పత్తి తగ్గడం, క్రోమేట్ కడుపు సమస్యలు వస్తాయి. కాబట్టి సహజమైనవి ఏవో తెలుసుకుని పండ్లను కొనడం బెటర్.

ఇది కూడా చూడండి: Realme: బడ్జెట్‌లో రియల్‌మీ కొత్త ఫోన్.. ఫీచర్స్ అదుర్స్

 

Related News

Viral News: కార్ల‌లో క్యాన్స‌ర్ కార‌క కెమిక‌ల్స్‌.. అధ్య‌య‌నంలో షాకింగ్ నిజాలు

కార్లలో ప్రయాణించే వారికి తాజా అధ్యయనం పెద్ద హెచ్చరిక చేసింది. కారులో రోజుకు ఒక గంట ప్రయాణించినా క్యాన్సెర్ వచ్చే ప్రమాదం ఉందని అమెరికా అధ్యయనం వెల్లడించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.