weight loss : బరువు తగ్గడానికి సహాయం చేసే పండ్లివే!
బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఉన్న వారు చిరు తిండిని తినాలనుకున్నప్పుడు వేరే ఏమీ తినకుండా కొన్ని పండ్లను ఎంచుకుని తింటే సరిపోతుంది. అవి వారి వెయిట్ లాస్ జర్నీని మరింత ప్రభావవంతంగా చేస్తాయి. ఆ పండ్లు ఏంటంటే..?
fruits for weight loss : చాలా మంది బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారు తప్పకుండా ప్రత్యేకమైన డైట్‌ని తీసుకోవాల్సిందే. సరైన డైట్ చేయడం, తిన్న దానికి సరిపడా వ్యాయామం చేయడం రెండూ కూడా బరువు తగ్గడంలో కీలకంగా పని చేస్తాయి. అయితే సాధారణంగా భోజనం చేసిన రెండు, మూడు గంటల తర్వాత మళ్లీ మనకు ఏదో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటుంది. బరువు తగ్గాలనుకునే(weight loss) వారు ఈ సమయంలో కొన్ని పండ్లను(fruits) తినడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది.
క్యాలరీలు తక్కువగా వచ్చే పండ్లను(fruits) ఈ సమయంలో తినడం ఎంతో అవసరం. అందుకనే యాపిల్స్, పుచ్చకాయలు, బెర్రీలు, అవకాడోలు, ద్రాక్ష, నారింజ, బత్తాయి, కమలాఫలం, కివి లాంటి పండ్లు వెయిట్ లాస్ జర్నీలో తినేందుకు ఎంతో అనువైన పండ్లు. ఇవి తక్కువ గ్లైకమిక్ ఇండెక్స్‌ని(glycemic index) కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని తినడం వల్ల మనలోకి అధికంగా క్యాలరీలు, చక్కెరలు చేరిపోవు. దీంతో శరీరంలో ఉన్న క్యాలరీలు ఖర్చయ్యేందుకు ఆస్కారం ఉంటుంది.
ఈ పండ్లలో కొవ్వుల్ని కరిగించే లక్షణం అధికంగా ఉంటుంది. వీటిలో అనేక రకాల విటమిన్లతోపాటు, ఫైబర్, ఫోలేట్, పాస్ఫరస్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. నీటి శాతమూ అధికంగా ఉంటుంది. దీంతో తిన్న తర్వాత పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. దీంతో వేరే ఏ పదార్థాలనూ మనం తినకుండా ఉంటాం. అందువల్ల బరువు తగ్గడం(weight loss) మరింత సులభతరం అవుతుంది.