Liver Damage: మనం ఏది తిన్నా దాని మంచి చెడు ప్రభావాలు మన కాలేయంపై కనిపిస్తాయి. శరీర భాగాలన్నీ ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మనం ఖచ్చితంగా మన ఆహారంపై కొంత శ్రద్ధ వహించాలి. ఇలా చేయకపోతే అనేక శరీర భాగాలు దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది. చెడు ఆహారం కారణంగా పాడైపోయే అవయవాలలో కాలేయం కూడా ఒకటి. ముఖ్యంగా చలికాలంలో ఇలాంటి ఆహారపదార్థాలు తెలిసో తెలియకో తింటే మన కాలేయంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇప్పటికే కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు అలాంటి ఆహారాలను తినే ముందు ఆలోచించాలి. ఏయే ఆహారాలు కాలేయాన్ని దెబ్బతీస్తాయో తెలుసుకుందాం.
తీపి పదార్థాలు
చలికాలంలో తీపి పదార్థాలను ఎక్కువగా ఇష్టపడతారు. కానీ చక్కెర అధికంగా ఉండే ఆహారాలు కాలేయానికి హాని కలిగిస్తాయి. రోజూ ఆహారంలో తీపి పదార్థాలు తీసుకుంటే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా శుద్ధి చేసిన చక్కెర కాలేయానికి మరింత ప్రమాదకరం.
వేపుళ్లు
చలికాలంలో పకోడీలు, ఇతర డీప్ ఫ్రైడ్ స్నాక్స్ టీతో పాటు తింటారు. కొన్నిసార్లు చిప్స్ , కొన్నిసార్లు ఫ్రైస్ వంటివి మంచి రుచిగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిగణించబడతాయి. ఇటువంటి ఆహారాలు నేరుగా మన కాలేయానికి హాని చేస్తాయి.
ఉప్పు
ఎక్కువ సోడియం అంటే ఉప్పు కూడా కాలేయాన్ని దెబ్బతీస్తుంది. చాలా కారంగా లేదా ఉప్పగా ఉండే వస్తువులకు దూరంగా ఉండండి. కాలేయ సమస్యలతో బాధపడేవారు తక్కువ కారంగా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా, పిండితో చేసిన వస్తువుల వినియోగాన్ని కూడా తగ్గించాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ కాలేయానికి హాని కలుగుతుంది.