Health Tips: నిద్ర సమస్యలు వేధిస్తున్నాయా? వీటికి దూరంగా ఉండండి
నేటి రోజుల్లో చాలా మంది తమ ఆరోగ్యాన్ని(Health) సరిగా పట్టించుకోవడం లేదు. ప్రతి మనిషికి తిండి(Food), నీరు(Water) ఎంత అవసరమో నిద్ర(Sleep) కూడా అంతే అవసరం. రోజంతా యాక్టీవ్‌గా ఒత్తిడి లేకుండా ఉండేందుకు నిద్ర చాలా అవసరం.
నేటి రోజుల్లో చాలా మంది తమ ఆరోగ్యాన్ని(Health) సరిగా పట్టించుకోవడం లేదు. ప్రతి మనిషికి తిండి(Food), నీరు(Water) ఎంత అవసరమో నిద్ర(Sleep) కూడా అంతే అవసరం. రోజంతా యాక్టీవ్‌గా ఒత్తిడి లేకుండా ఉండేందుకు నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర మన ఇమ్యూనిటీ(Immunity)ని పెంచుతుంది. గుండె జబ్బుల(Heart Problems) బారి నుంచి కాపాడుతుంది. అనేక అనారోగ్య సమస్యల ముప్పు నుంచి కాపాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సరైన నిద్ర పోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొందరిలో మాత్రం నిద్ర సమస్యలు(Sleep Problems) వేధిస్తుంటాయి. రాత్రిపూట నిద్రపట్టక చాలా మంది మానసికంగా బాధపడుతుంటారు. అలాంటివారు ఏ పని చేసినా కూడా త్వరగా అలసిపోతుంటారు. కొన్ని ఆహారపు అలవాట్ల(Food Habits) వల్ల నిద్ర సమస్యలనేవి తలెత్తుతుంటాయి. కాబట్టి రాత్రి సమయంలో నిద్రపోయే ముందు ఆ ఆహారాలకు దూరంగా ఉండటం చాలా మంచిది.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 8 గంటల పాటు నిద్ర(Sleep)పోవాలి. తగినంత నిద్రలేకుంటే బద్ధకం, అలసట, తలనొప్పి వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. శరీరానికి ఎక్కువ శక్తిని కార్బోహైడ్రేట్లు(Carbohydrates) అందిస్తాయి. అయితే మనం ప్రతి రోజూ మితంగానే ఈ కార్పోహైడ్రేట్ పదార్థాలను తీసుకోవాలి. బ్రౌన్ పాస్తా, క్వినోవా, బ్రౌన్ రైస్, హోల్ మీల్ బ్రెడ్ వంటివి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉండేలా చేస్తుంది. బీన్స్, పప్పులు, పండ్లు, కూరగాయలు, గింజలు వంటివి తీసుకోవాలి.
చాలా మంది పగలు, రాత్రి అనే తేడా లేకుండా విపరీతంగా టీ(Tea), కాఫీ(Coffee)లు తాగుతుంటారు. వాటి వల్ల నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. కాఫీలో కెఫిన్(Cafine) ఎక్కువగా ఉండటం వల్ల అది నిద్రకు భంగం కలిగిస్తుంది. రోజుకు నాలుగు కప్పుల కాఫీ కంటే ఎక్కువగా తాగకండి. అలాగే రాత్రి పూట నిద్రపోయే ముందు(Before Sleep) అస్సలు కాఫీ తాగొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ రోజుల్లో చాలా మంది బరువు(Weight) తగ్గేందుకు ఆహారాన్ని తక్కువగా తీసుకుంటున్నారు. అలా చేయడం వల్ల నిద్ర సమస్యలు(Sleep Problems) తలెత్తుతాయి. ఉదయం, రాత్రి సమయాల్లో భోజనం మానడం వల్ల చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి. ఆకలి ఉన్నప్పుడు ఆహారం(Food) తీసుకోవడం ఉత్తమం. రాత్రి సమయంలో భోజనం మానకూడదు. పండ్లు(Fruits), కూరగాయలు(Vegetables), చపాతీ, ఇడ్లీ, బ్రౌన్ రైస్ వంటివి తీసుకోవడం మంచిది. ఇవి మీ నిద్రకు ఎటువంటి ఆటంకం కలిగించవు. కొందరు మధ్యాహ్న భోజనం(Food)లో ఎక్కువ ఫుడ్ తింటూ ఉంటారు. దాని వల్ల వారు అలసిపోతారు. తీసుకునే ఆహారంలో కూరగాయలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి.
ఇప్పుడంతా ఉరుకుల పరుగుల జీవనం. ప్రతి ఒక్కరికీ తగినంత నీరు(Water) అవసరం. శరీరం సక్రమంగా పనిచేయడానికి నీరు చాలా ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ కనీసం 10 గ్లాసుల నీరు తాగాలి. జీవ క్రియలు సజావుగా సాగడానికి తగినంత నీరు(Drink) తాగడం మంచిది. రాత్రి సమయంలో పడుకునే ముందుకు ఆల్కాహాల్, మితిమీరిన కాఫీ(coffee), తీపి పదార్థాలు(Sweets) తీసుకోకండి. వాటికి బదులుగా పాలు, కొబ్బరి నీు, రసం వంటివి తీసుకోండి. ఇవి మీకు మంచి నిద్ర(Sleep)ను అందిస్తాయి.