Health Tips: హైపర్ టెన్షన్‌ని చిటికెలో మాయం చేసే ఫుడ్ ఇదే..!
హైపర్ టెన్షన్ లేదా హైబీపీ సమస్య ఈ రోజుల్లో సర్వసాధారణం. ఈ స్థితిలో గుండె నుండి శరీరంలోని ఇతర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాలలో రక్తపోటు పెరుగుతుంది. మరింత ఒత్తిడితో రక్తం వేగంగా కదలడం ప్రారంభిస్తుంది. ఇది మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండెకు ఎక్కువ నష్టం కలిగిస్తుంది. అయితే మంచి ఆహారంతో రక్తపోటును చాలా వరకు నియంత్రించవచ్చు. రక్తపోటును నియంత్రించడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సాధారణ రక్తపోటు 120/80 లేదా కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే రక్తపోటు దీని కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆహారంలో మార్పు అవసరం.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారంగా రక్తపోటును నియంత్రించడానికి తక్కువ కొవ్వు ఆహారం తీసుకోవాలి. అనేక రకాల కూరగాయలు, పండ్లు కూడా ఈ విషయంలో సహాయపడతాయి. ప్రతిచోటా సులభంగా లభించే అరటిపండు కూడా దీనికి చాలా ప్రయోజనకరమైన పండు అని చెప్పొచ్చు. అరటిపండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అరటి పండును ఎప్పుడైనా తినవచ్చు. ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మిగతా అందరూ అరటిపండ్లను విచక్షణతో తినవచ్చు. అరటిపండును ఎలాగైనా తింటే మంచిది. ఫ్రూట్ జ్యూస్, ఫ్రూట్ స్లైస్, పంచదార వేయకుండా స్టూ లాగా తినవచ్చు.
మీరు ఆశ్చర్యపోవచ్చు, ప్రతిరోజూ అరటిపండు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అరటిపండులోని పోషకాలు పొట్టలోని pH స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. అంతేకాకుండా పొట్టలోని అల్సర్లను నయం చేసే శక్తి వీటికి ఉంది. అరటిపండు మహిళలకు మరింత మేలు చేస్తుందని చెబుతారు. అందులోని గ్లూకోజ్ ద్వారా శరీరం శక్తిని పొందుతుంది. స్త్రీలలో అధిక పని తర్వాత అలసట నుండి ఉపశమనం లభిస్తుంది.
హైపర్‌టెన్షన్‌ను నియంత్రించడంలో అరటిపండు ఎలా సహాయపడుతుంది?
అరటిపండులో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఫైబర్ ,విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇందులో కరిగే ఫైబర్ కూడా ఉంటుంది. ఇది కొవ్వు పరిమాణాన్ని తగ్గించడానికి అనుకూలంగా ఉంటుంది. అరటిపండు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్ B6, మెగ్నీషియం కండరాలకు విశ్రాంతినిస్తాయి. నిద్ర రుగ్మత సమస్యను తొలగిస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి
అరటిపండులో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు సహజంగానే మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
పొటాషియం మంచి మూలం
అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. హైపర్‌టెన్షన్‌ను నియంత్రించడంలో ఇది అద్భుతమైన పదార్ధం. పొటాషియం తీసుకోవడం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటు తగ్గుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక మధ్య తరహా అరటిపండులో 450 గ్రాముల పొటాషియం లభిస్తుంది.
సోడియం
అరటిపండ్లలో సోడియం తక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు ఎంత ఎక్కువ పొటాషియం తీసుకుంటే, మీ శరీరం నుండి సోడియం బాగా తొలగించడానికి ఉపయోగపడుతుంది.