తెలంగాణ సీఎం కేసీఆర్ నిధులను సమకూర్చుతానని ఉన్నికల సమయానికి మాట తప్పినట్లుగా జేడీఎస్ అధినేత కుమారస్వామి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అది ఎంతవరకు నిజమన్నది తెలయాల్సి ఉంది.
జేడీఎస్ అధినేత కుమారస్వామి తెలంగాణ సీఎం కేసీఆర్ ను నుమ్మి నిండామునిగాడని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియదుకానీ, కన్నడ పాలిటిక్స్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక బీజేపీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ లు హోరా హోరీగా పోరాడాయి. సర్వశక్తులు ఒడ్డాయి. అయితే జేడీఎస్ కుమారస్వామి మాత్రం ఎన్నికలు అయిపోయాక తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కాడు. తాము సరైన సమయంలో నిధులను సమకూర్చుకోలేక పోయామన్నారు. తమకు పట్టున్న ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో కూడా ఈ సారి గెలిచే అవకాశాలు సన్నగిల్లాయని అభిప్రాయపడ్డారు.
చావో రేవో లాంటి ఎన్నికల్లో జేడీఎస్ అధినేత మాజీ ప్రధాని దేవగౌడ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సారి పట్టు సాధించాలని, 30 సీట్లు గెలిస్తే తామే కింగ్ మేకర్ అయ్యే చాన్స్ ఉందని ముందుగానే అభ్యర్థులను ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో తగినంత డబ్బు అందక అభ్యర్థుల ఖర్చులకు ఇవ్వడానికి కూడా నగదు లేకుండా పోయినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ జేడీఎస్ కు నిధులను సమకూరుస్తున్నారని గతంలో హామీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.
సీఎం కేసీఆర్ కర్ణాటకకు చాలా సార్లు వెళ్లి జేడీఎస్ నేతలతో సమావేశం అయ్యారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, జేడీఎస్ కలిసి పోటీచేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ జాతీయ పార్టీ అని ప్రకటించిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే కేసీఆర్ చివరి నిమిషంలో జేడీఎస్ కు నిధులు సమకూర్చలేదని అంటున్నారు. కుమారస్వామి కూడా కేసీఆర్ ను నమ్మి వేరే దగ్గర నుంచి నిధులను సమకూర్చుకోలేదని తెలుస్తోంది. నిజానికి కుమారస్వామికి ఎవరు హ్యాండ్ ఇచ్చారు..? పార్టీకి నిధుల లేమి ఎందుకు వచ్చింది..? అసెంబ్లీ ఎన్నికలకు సాయం చేస్తానన్నవారే చివరి నిమిషంలో ముఖం తిప్పేసారా అన్ని ప్రశ్నలు కర్ణాటక సర్కిళ్లలో శికారు కొడుతున్నాయి.