అనిల్ కపూర్ కూతురు కావడంతో ఇండస్ట్రీలోకి ఈజీగానే వచ్చింది సోనమ్ కుమార్. సినిమాల్లో నిలదొక్కుకోవడానికి మాత్రం టాలెంట్‌ను నమ్ముకుంది. పెళ్లయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో తన పిక్స్, వీడియోలను షేర్ చేస్తోంది.
Sonam: సెలబ్రిటీ కిడ్ హోదాలో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది సోనమ్ కపూర్. అనిల్ కపూర్ కూతురు కావడంతో ఇండస్ట్రీలోకి ఈజీగానే వచ్చింది. సినిమాల్లో నిలదొక్కుకోవడానికి మాత్రం టాలెంటే కారణం.
అందం, అభినయంతో ఆకట్టుకుంది. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు, నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటించి, మెప్పించింది.
పెళ్లి చేసుకొని సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియాలో పిక్స్, వీడియోలను షేర్ చేస్తుంటుంది.
స్టైలింగ్ మీద సోనమ్‌కు ఆసక్తి ఎక్కువ. ఇన్స్టాగ్రామ్ ఫీడ్ ఫ్యాషన్ ఔత్సాహికులకు నిరంతరం ప్రేరణ కలిగిస్తోంది.
సూపర్ ఎలిగెంట్ డ్రెస్‌లో సోనమ్ మెరిసిపోయింది. ఆ డ్రెస్‌కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ధరించారు. సింపుల్ మేకప్‌తో స్టైలిష్‌గా కనిపించింది.
2007లో వచ్చిన ‘సవారియా’ చిత్రంతో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది సోనమ్ కపూర్. ఆ తర్వాత వెనదిరిగి చూడలేదు.
బాలీవుడ్ స్టార్ హీరోలు అందరీతో కలిసి నటించింది. పెళ్లయిన తర్వాత లండన్‌లో స్థిరపడింది.