»Urfi Javed Said My Photo Was Posted On An Adult Site In My 15 Years Of Age 2023
Urfi Javed: నా ఫోటో అడల్ట్ సైట్లో పెట్టారు.. చనిపోవాలనుకున్నా
నటి ఉర్ఫీ జావెద్(Urfi Javed) ఆమె 15 ఏళ్ల వయసులో జరిగిన ఓ కీలక సంఘటన గురించి పంచుకుంది. తన ఫేస్ బుక్ పోస్టులో పెట్టిన చిత్రాన్ని ఎవరో అడల్ట్ సైట్లో పెట్టారని తెలిపింది. అది తెలిసిన ఆమె తండ్రి తీవ్రంగా కొట్టినట్లు వెల్లడించింది.
యూపీ నటి ఉర్ఫీ జావెద్(Urfi Javed) తన గురించి ఓ ఆసక్తికర విషయం అభిమానులతో పంచుకుంది. ఆమె 15 సంవత్సరాల వయస్సులో తన చిత్రాన్ని ఓ అడల్ట్ సైట్లో అప్లోడ్ చేసిన సందర్భం గురించి వెల్లడించింది. ఫోస్ బుక్ లో పెట్టిన ఫొటోను ఎవరో తెలియని వారు అలా చేశారని చెప్పింది. ఆ క్రమంలో తనని ఆమె తండ్రి దారుణంగా కొట్టినట్లు తెలిపింది. అంతేకాదు అడల్ట్ సైట్ వాళ్లు రూ.50 లక్షలు అడిగారని అందరికీ చెప్పి ఆమె నాన్న(father) సానుభూతి పొందేందుకు ప్రయత్నించాడని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఆమె బంధువులు(family), ఆమె తండ్రి తనను శారీరకంగా, మాటలతో వేధించేవారని వెల్లడించింది. ఒకనొక సమయంలో తన ఇంట్లో వాతావరణం, తన తండ్రి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చినట్లు వాపోయింది. ఆ క్రమంలో తన 17 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయినప్పటికీ కూడా తన ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆమె గుర్తుచేసుకుంది.
ఆ నేపథ్యంలో ఢిల్లీకి చేరుకుని ఓ కాల్ సెంటర్లో పనిచేయడం ప్రారంభించి తరువాత క్రమంగా ఫ్యాషన్ వైపు మళ్లీనట్లు తెలిపింది. ఆ తరువాత ముంబైకి వెళ్లి పలు టీవీ సిరియల్స్ లలో ఆవకాశాల కోసం ఆడిషన్స్ ఇచ్చానని చెప్పింది. ఆ క్రమంలో టెలివిజన్‌లో చిన్న పాత్రలను పొంది..ఆ తర్వాత బిగ్ బాస్‌లో అవకాశం వచ్చే స్థాయికి చేరినట్లు చెప్పుకొచ్చింది.
డర్టీ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో Urfi Javed తన ‘కష్టమైన’ బాల్యం గురించి తెలిపింది. ఆమె తండ్రి.. ఆమె తోబుట్టువులు, ఆమె తల్లి కూడా అతనిచే మాటలతో, శారీరకంగా వేధించబడ్డారని ఆరోపించింది. రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కూడా వెల్లడించింది. అతను మమ్మల్ని, మా అమ్మని కూడా కొట్టేవాడు. అనేక రకాల పదజాలంతో తిట్టేవారని తెలిపింది. కానీ Urfi చాలా ఎక్కువగా టీవీ చూడటం వల్ల ఫ్యాషన్‌పై ఆసక్తి పెరిగినట్లు వెల్లడించింది. తనకు పెద్దగా ఫ్యాషన్ పరిజ్ఞానం లేదని, కానీ ప్రతి సారీ తాను డిఫరెంట్‌గా కనిపించాలని అనుకుంటానని ఆమె వెల్లడించింది.