Pushpa 2 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిట్ సీక్వెల్ 'పుష్ప 2' పై భారీ అంచనాలున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తోంది. ఇటీవలె షూటింగ్ స్టార్ట్ చేశారు. వైజాగ్ షెడ్యూల్ తర్వాత.. ప్రస్తుతం రామోజి ఫిలిం సిటీలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిట్ సీక్వెల్ ‘పుష్ప 2’ పై భారీ అంచనాలున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తోంది. ఇటీవలె షూటింగ్ స్టార్ట్ చేశారు. వైజాగ్ షెడ్యూల్ తర్వాత.. ప్రస్తుతం రామోజి ఫిలిం సిటీలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమా నుంచి అదిరిపోయే సర్ప్రైజ్ రాబోతున్నట్టు గత కొద్ది రోజులుగా.. జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే ఉంది. దాంతో ఆ రోజు పుష్ప2 నుంచి బిగ్ అప్డేట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం టీజర్ రిలీజ్ చేయబోతున్నారనే టాక్ ఉంది. అయితే టీజరే కాదు మరో సాలిడ్ అప్డేట్ కూడా రానుందనే టాక్ నడుస్తోంది. రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే టీజర్ విషయంలో మాత్రం అస్సలు సుకుమార్ తగ్గేదేలే అంటున్నారట. టీజర్ కోసమే ప్రత్యేకంగా కొన్ని సాలిడ్ షాట్స్ షూట్ చేశాడట. జస్ట్ టీజర్‌తోనే ఒక్కసారిగా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయాలని భావిస్తున్నాడట. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్‌ని దృష్టిలో పెట్టుకొని.. టీజర్ ప్లాన్ చేస్తున్నాడట. ఎంతలా అంటే.. ఏకంగా వెయ్యి కోట్ల బిజినెస్ టార్గెట్ చేస్తున్నాడట. ఇప్పటికే హిందీ నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్క హిందీ అనే కాదు.. అన్ని భాషల్లోను పుష్ప2 చిత్ర యూనిట్ అదిరిపోయే ప్లానింగ్‌లో ఉందట. పాన్ ఇండియా లెవల్లో ఐదు భాషల్లోనే కాకుండా.. వీలైనన్ని ఎక్కువ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకే.. ఏప్రిల్ 8న పుష్ప2కి ఎంతో కీలకం కానుందని అంటున్నారు. ఇక రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. మళయాళ హీరో పహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.