దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన సీతారామం మూవీ.. క్లాసికల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో తెలుగు కుర్రకారును కట్టిపడేసింది మృణాల్ ఠాకూర్. సినిమాలో సీత పాత్రలో చూసి.. నిజంగానే ఆమెను సీతలా ఫీల్ అవుతున్నారు. అందుకే అమ్మడు ఎలాంటి సినిమాలు ఎంచుకుంటోంది.. ఏ హీరోతో జోడి కడుతోందని ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికే న్యాచురల్ స్టార్ నాని 30వ సినిమాలో హీరోయిన్గా ఫైనల్ అయిపోయింది మృణాల్. రీసెంట్‌గానే ఈ సినిమా లాంఛనంగా స్టార్ట్ అయిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత సీతకు తెలుగు నుంచి మరో ఆఫర్ తలుపు తట్టినట్టు తెలుస్తోంది. అదే మన కింగ్ నాగార్జున నుంచి కాల్ వెళ్లినట్టు సమాచారం. ది ఘోస్ట్‌తో మెప్పించలేకపోయిన నాగ్.. నెక్స్ట్ సినిమా ధమాకా రచయిత ప్రసన్నకుమార్ బెజవాడతో చేయబోతున్నాడు. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రాబోతోంది. ఇందులో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు టాక్. ఈ సినిమాలోనే మృణాల్ ఠాకూర్‌ను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఇది సీతకు బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు. కానీ ఆమె ఫ్యాన్స్ మాత్రం.. అప్పుడే సీనియర్ హీరోతో రొమాన్స్ ఏంటని హర్ట్ అవుతున్నారు. అంతేకాదు సీనియర్ హీరోతో నటించిన తర్వాత యంగ్ హీరోలు అమ్మడిని పట్టించుకుంటారా అని కామెంట్ చేస్తున్నారు. అలాగే సీనియర్ హీరోలకు బెస్ట్ ఛాయిస్‌గా మారిపోతుందని అంటున్నారు. అందుకే ఇప్పుడే ఇలాంటి ఆఫర్లు ఒప్పుకోవద్దని సూచిస్తున్నారు. అయితే ఇంకా నాగ్ ప్రాజెక్ట్ గురించి అఫిషీయల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. కాబట్టి ఖచ్చితంగా సీత.. నాగ్‌తో రొమాన్స్ చేస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేం.