»Sai Dharam Tej %e0%b0%b5%e0%b0%bf%e0%b0%b0%e0%b1%82%e0%b0%aa%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7 %e0%b0%9f%e0%b1%80%e0%b0%9c%e0%b0%b0%e0%b1%8d %e0%b0%b0%e0%b0%bf%e0%b0%b2%e0%b1%80%e0%b0%9c
Sai Dharam Tej : ‘విరూపాక్ష’ టీజర్ రిలీజ్.. చరిత్రలో ఇదే మొదటిసారి!
Sai Dharam Tej యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత.. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న సినిమా 'విరూపాక్ష'. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు.. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది.
యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత.. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న సినిమా ‘విరూపాక్ష’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు.. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఏప్రిల్ 21న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాను ఆడియన్స్ ముందుకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ గ్లింప్స్ మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. దాంతో టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకే మార్చి 1న టీజర్ రిలీజ్ చేయాలనుకున్నారు. అంతకు ముందు రోజు పవన్ కళ్యాణ్ టీజర్‌ని లాంచ్ చేసాడు. అయితే మరి కొన్ని గంటల్లో విరూపాక్ష టీజర్ రిలీజ్ అవనుండగా.. సాయి ధరమ్ తేజ్ భీమవరం ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మరణించడంతో వాయిదా వేశారు. దాంతో మార్చి 2న టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ చూస్తుంటే.. డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో మిస్టరీ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటి సారి అనే డైలాగ్‌తో మొదలైన టీజర్.. ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. విజువల్స్ చాలా గ్రాండియర్‌గా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఈ సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. అందుకు తగ్గట్టే బీజిఎం హైలైట్‌గా నిలిచింది. ఇక సాయి ధరమ్ లుక్ అదిరిపోయింది. అయితే టీజర్లో అసలు పాయింట్ రివీల్ చేయకుండా.. సస్పెన్స్ మెయింటేన్ చేశారు. మొత్తంగా ఓ గ్రామంలో జరిగే మిస్టరీని.. హీరో చేధించినట్టుగా చూపించారు. ఇక ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్రహ్మాజీ, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి విరూపాక్షతో సాయి ధరమ్ తేజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.