ప్రభాస్, పవన్ రాకతో బాలయ్య అన్‌స్టాపబుల్ షో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. అయితే ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ సమయంలో.. ఆహా యాప్ క్రాష్ అయిపోయింది. దాంతో పవన్ ఎపిసోడ్‌కు ముందుగానే జాగ్రత్త పడింది ఆహా. అయినా పవన్ ఫ్యాన్స్ దెబ్బకి ఆహా క్రాష్ అయిపోయింది. కానీ వెంటనే బ్యాక్ అప్ టీం అప్రమత్తం కావడంతో అంతా సెట్ అయిపోయింది. ఇక అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 2న అందుబాటులోకి వచ్చిన పవన్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్.. ‘ఆహా’ అనేలా ఉంది. పవన్ గురించి బాలకృష్ణ ఇచ్చిన ఎలివేషన్, బాలయ్య పై పవన్ చూపించిన స్పెషల్ ఇంట్రెస్ట్ ఫ్యాన్స్‌కు ఫుల్లుగా కిక్ ఇస్తోంది. బాలయ్య మాటల్లో పవర్ స్టార్ ఎలివేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే మూడు పెళ్లిల్ల గురించి పవన్ క్లారిటీ ఇచ్చిన తర్వాత.. పవర్ ఫుల్ పొలిటికల్ పంచ్ వేశారు బాలయ్య. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు బాలయ్య తెగ నచ్చేశాడు. గతంలో సినిమాల పరంగా వీళ్ల మధ్య ఏం జరిగిందనేది పక్కన పెడితే.. ఈ షో చూసిన తర్వాత మెగా, నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దాంతో పవన్ అన్ స్టాపబుల్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ ఎపిసోడ్ వచ్చిన కొన్ని నిమిషాల్లోనే ఆల్ టైం రికార్డులు సెట్ చేసింది. హైయెస్ట్ యాప్ లాంచ్, అత్యధిక స్ట్రీమింగ్ మినిట్స్.. ఇలా మొదటి 90 నిమిషాల్లో పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది. అలాగే ఫాస్టెస్ట్ 100 మిలియన్ మినిట్స్‌ని క్రాస్ చేసి సరికొత్త రికార్డు సెట్ చేశారని ప్రకటించారు ఆహా వారు. దాంతో నెక్స్ట్ పార్ట్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 10న నెక్స్ట్ పార్ట్ స్ట్రీమింగ్కి రానుందని అంటున్నారు. మరి ఇది ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.