మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ విరూపాక్ష. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. . ఇక సినిమా డైరెక్టర్ కార్తీక్ దండు పేరు మార్మోగిపోతోంది. కొత్త డైరెక్టర్ అయినా, ఎక్కడా తడపడకుండా అతను సినిమా తీసిన విధానికి అందరూ ఫిదా అయిపోతారు. ప్రస్తుతం సినిమా కాసుల వర్షం కురిపించింది.
డైరెక్టర్ వినయ్ రత్నం 'సాగు' మూవీని అద్భుతంగా తీర్చిదిద్దాడు. రైతు చుట్టూ సాగే ఈ కథ అందరికీ నచ్చుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన అద్భుత చిత్రం. ఓటమికి భయపడని వాడిపై ఓటమి ఎప్పటికీ గెలవలేదని చాటిచెప్పే సందేశాత్మక చిత్రం 'సాగు'.
ఆగస్టు 15న ఖుఫీ మూవీ మ్యూజికల్ కాన్సెర్ట్ జరిగింది. ఈ వేడుకలో భాగంగా హీరోయిన్ సమంత, హీరో విజయ్ దేవరకొండ స్టేజ్‌పై లైవ్ పర్ఫార్మెన్స్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. హద్దులు దాటి డ్యాన్స్ చేశారని ట్రోల్స్ చేస్తున్నారు.
నటి సోనమ్ కపూర్‌కు దగ్గుబాటి రానా క్షమాపణలు చెప్పారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సోనమ్ గురించి పరోక్షంగా రానా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకీపారేయడంతో రానా.. ట్వీట్ చేసి చల్లార్చే ప్రయత్నం చేశారు.
తన నెక్ట్స్ మూవీ ధీరలో పూజా హెగ్డే హీరోయిన్ కావాలని అక్కినేని అఖిల్ పట్టు బడుతున్నాడు. బుట్ట బొమ్మ నటిస్తే మినిమం గ్యారంటీ ఉంటుందని.. మూవీ సక్సెస్ అవుతుందని భావిస్తున్నాడు.
గ్లామర్ రోల్స్ చేసేందుకు ఆండ్రియా సై అంటోంది. అర్ధనగ్నంగా నటిస్తే తప్పేంటి అని ఎదురు ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో 6 సినిమాలకు పైగా ఉన్నాయి.
హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ కలర్ స్వాతి నటించిన ఇండిపెండెన్స్ డే స్పెషల్ ది సోల్ ఆఫ్ సత్య అనే పాటను రామ్ చరణ్ చేతులు మీదుగా ఈ రోజు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ అందరి మనసును దోచుకుంటోంది.
సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం చిత్రం సెకండ్ టీజర్ వచ్చేసింది. పోలిటికల్ సెటైర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దివంగత నేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత ఏపీలో జరిగిన పరిణాలమాలను ఇందులో తెరకెక్కిస్తున్నారు.
ముంబైకి మకాం మార్చినట్లు వస్తున్న వార్తలపై హీరో సూర్య క్లారిటీ ఇచ్చాడు. ఫ్యాన్స్ మీట్‌లో పాల్గొన్న సూర్య అందరి సమక్షంలో నిజం చెప్పారు. అక్కడ తనకు ఇళ్లు ఉన్నది వాస్తవమేనని స్పష్టం చేశారు. అయితే అక్కడ ఉండేది సూర్య కాదట.
పూజా కన్నన్ 2021లో తమిళంలో చితిరై సెవ్వానం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కిన సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో వర్సటైల్ యాక్టర్ సముద్రఖని పూజా కన్నన్ కు తండ్రి పాత్రలో నటించారు.
అమలాపాల్ ఓ చెత్త హీరోయిన్ అని తమిళ హీరో అథర్వ మురళి అన్నారు. ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా చర్చకు దారితీశాయి.
సినిమా అంటేనే రంగుల ప్రపంచం.. దూరం నుంచి చూస్తే కలర్ ఫుల్‌గా ఉంటుంది.. కానీ ఒక్కసారి అందులోకి దిగితేనే దాని అసలు రంగు తెలుస్తుంది. ఇచ్చిన వారికి అడగకుండానే ఇస్తుంది.. అడిగిన వారికి ఇచ్చినట్టే ఇచ్చి జీవితాన్ని చీకట్లోకి నెట్టెస్తుంది. ముఖ్యంగా నిర్మాతల పరిస్థితి చెప్పుకోకుండా ఉంటుంది. ఇప్పుడు అనిల్ సుంకర పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఏకంగా ఈ మెగా ప్రొడ్యూసర్ 200 కోట్లు లాస్ అయినట్టు లెక్కలు వేస...
ఇండియాలో ఎంతమంది హీరోలున్నా.. ఇండియన్ సూపర్ స్టార్ ఒక్కడే. స్టైల్‌లో రజినీకాంత్‌ని కొట్టేవాడే లేడు. రజనీ స్టైల్, మాస్ స్వాగ్ ఇప్పటికీ అలాగే ఉంది. ఏడు పదుల వయసులోనూ భాషా రేంజ్ సినిమా ఇచ్చాడంటే.. అది ఒక్క తలైవాకే సాధ్యమని జైలర్ సినిమాతో ప్రూవ్ చేశాడు. సినిమా రిజల్ట్‌ను ముందే చెప్పేశాడు స్వామిజీ.
ఫేక్ థంబ్ నెల్స్‌పై హీరో కార్తీకేయ మండిపడ్డారు. తన కొత్త మూవీ బెదురులంక 2012 ప్రమోషన్స్‌లో ఇంటర్వ్యూ గురించి చేసిన థంబ్స్ గురించి ఫైరయ్యారు. ఇంటర్వ్యూలో చెప్పని మాటలను చెప్పినట్టు రాశారని, ప్లీజ్ అలా చేయొద్దని కోరారు.
సూర్య(suriya sivakumar) కాదు.. విక్రమ్ సినిమా తర్వాత రోలెక్స్ అంటూ రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. విక్రమ్ సినిమాలో కనిపించింది కొద్ది సేపే కానీ.. ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ సినిమా పై కాసుల వర్షం కురిపించేలా చేసింది. క్లైమాక్స్‌లో గూస్ బంప్స్ తెప్పించిన రోలెక్స్(rolex) ఇప్పుడు.. ఫుల్ లెంగ్త్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.