»Not Cm I Will Do The Same As Anyone Rajini Clarity
Rajni Clarity: సీఎం కాదు, ఎవ్వరున్నా అలాగే చేస్తాను
అసలు సూపర్ స్టార్ రజనీ కాంత్ ఏంటి? సీఎం పాదాలను తాకడం ఏంటి? ఇలా.. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాదాలు రజినీ తాకడంపై ఆయన అభిమానులు రకరకాలుగా స్పందించారు. ముఖ్యంగా తలైవా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఈ న్యూస్‌ను ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయారు. దీంతో తాజాగా రజనీ కాంత్ దీని పై క్లారిటీ ఇచ్చేశారు.
Not CM, I will do the same as anyone.. Rajini Clarity
Rajini Clarity: గత కొంత కాలంగా సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) వరుస ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. ఈ నెల 10వ తేదీన రిలీజ్ అయిన ‘జైలర్’ మూవీ బాక్సాఫీస్ దగర కాసుల వర్షం కురిపించింది. ఎన్ని ఫ్లాపులు వచ్చినా తలైవా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ‘జైలర్’ వసూళ్లు నిరూపించాయి. విడుదలైన 10 రోజుల్లోనే 500 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. దీంతో రజనీ కాంత్ ఫ్యాన్స్ పండగ చేకున్నారు. కానీ సూపర్ స్టార్ మాత్రం రిలీజ్‌కు ముందు హిమాలయాలకు వెళ్లిపోయాడు. తిరిగిచ్చిన తర్వాత ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని కలిసిన తలైవా.. ఆయన పాదాలకి నమస్కరించడం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ విషయంలో గత రెండు మూడు రోజులుగా రజనీకాంత్ (Rajinikanth) పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
సూపర్ స్టార్ లాంటి వ్యక్తి యోగి పాదాలు తాకడం ఏంటి? అంటూ అభిమానులు గోల చేశారు. అది కూడా తన కన్నా వయసులో చిన్నవాడైన యోగి ఆదిత్యనాథ్ పాదాలు తాకడంపై నెటిజన్స్ రకరకాలుగా స్పందించారు. కొందరికి అది అస్సలు నచ్చలేదు. కొందరు మాత్రం సపోర్ట్ చేశారు. తాజాగా దీనిపై స్పందించారు రజనీకాంత్. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘స్వామిజీలు, యోగులు కనిపించినప్పుడు నేను వెంటనే వాళ్ల కాళ్లను తాకి ఆశీర్వాదం తీసుకుంటాను. వాళ్లు నాకంటే వయసులో పెద్ద వారా లేదా అని చూడను. అది నా పద్ధతి. అంతకు మించి వేరే ఉద్దేశ్యం లేదు’ అంటూ రజినీకాంత్ చెప్పారు. దీంతో తలైవా ఎందుకలా చేశాడనే దానిపై ఓ క్లారిటీ ఇచ్చేసినట్టేనని చెప్పొచ్చు.