ప్రభాస్-మారుతి(Prabhas Maruthi) కాంబోలో వస్తున్న చిత్రం 'రాజా డీలక్స్(raja deluxe)' నుంచి మరో ఫొటో లీక్ అయింది. గతంలో దర్శకుడు మారుతితో సినిమా సెట్స్‌లో ప్రభాస్ ఉన్న చిత్రం ఇది వరకు నెట్టింట లీకై తెగ వైరల్ అయ్యింది. ఈ క్రమంలో తాజాగా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ పిక్ చూసిన ప్రభాస్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.
టాలీవుడ్ స్టార్ నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని(Akhil Akkineni) పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'ఏజెంట్' ఏప్రిల్ 28న థియేట్రికల్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. హాలిడే సీజన్‌ని క్యాష్ చేసుకోవాలని సినీ నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీలో విలన్‌గా.. హిందీలో హీరోస్, దస్ కహానియా లాంటి సినిమాల్లో నటించిన 'డినో మోరియా(Dino Morea)ను తీసుకున్నారు.
పవన్ కల్యాణ్ కొడుకు భవిష్యత్తులో హీరోగా అరంగేట్రం చేయాలని అతని అభిమానులు భావిస్తున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్(akira nandan) విషయంలో అది ఇప్పుడు సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకో తెలియాలంటే ఈ వార్తను చదివేయండి మీకే తెలుస్తుంది.
RRR, బాహుబలి చిత్రాల డైరెక్టర్ SS రాజమౌళి(SS Rajamouli) అరుదైన ఘనతను సాధించారు. బాలీవుడ్ మెగాస్టార్ షారుఖ్ ఖాన్‌తో పాటు టైమ్ మ్యాగజైన్ 2023లో టాప్ 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. దీంతో ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇద్దరు భారతీయులుగా వీరిద్దరు నిలిచారు. ఇక రాజమౌళి కోసం అలియా భట్ ప్రొఫైల్ రాయగా, షారూఖ్ ఖాన్ ప్రొఫైల్‌ను దీపికా పదుకొనే రాసింది.
జూనియర్ ఎన్టీఆర్(NTR) సూపర్ లగ్జరీ గడియారాల సేకరణను కలిగి ఉన్నాడు. అంతేకాదు అప్పుడప్పుడు వాటిని ధరించి ప్రజల్లోకి కూడా వస్తాడు. మొన్న రాత్రి టాలీవుడ్ పెద్దలకు ఎన్టీఆర్ ఇచ్చిన విలాసవంతమైన పార్టీలో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ చాలా కాస్లీ అని తెలుస్తోంది. అయితే దాని రేట్ ఎంతో మీరు ఒక సారి అంచనా వేయండి.
రాఘవ లారెన్స్(Raghava Lawrence) ప్రధాన పాత్రలో తెరకెక్కిన రుద్రన్(Rudhran) లేదా రుద్రుడు మూవీ ఈరోజు(ఏప్రిల్ 14న) తమిళ్, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ క్రమంలో ఈ చిత్రం స్టోరీ, రేటింగ్ గురించి ఇప్పుడు చుద్దాం.
ప్రముఖ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) యాక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ శాకుంతలం(Shaakuntalam) ఈరోజు(ఏప్రిల్ 14న) విడుదలైంది. అభిజ్ఞాన శాకుంతలం స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం లవ్ స్టోరీ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
తనదైన శైలిలో వినూత్న సినిమాలు తీసే టాలీవుడ్ డైరెక్టర్ రవిబాబు(director Ravi Babu) నటి పూర్ణ(heroine poorna)తో లవ్ గురించి స్పందించారు. ఆమెతో ఐదు సినిమాలు చేయడం పట్ల గల కారణాన్ని కూడా వెల్లడించారు.
నూతన నటీనటులతో శాంతి కుమార్(Shanti Kumar ) తుర్లపాటి (జబర్దస్త్ ఫేమ్) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మించిన చిత్రం ‘నాతో నేను’(Natho Nenu). ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్ తాజాగా ఫిల్మ్ ఛాంబర్‌లో విడుదల చేశారు. టైటిల్ బాగుందని, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనిపిస్తుందని ఆయన అన్నారు.
కామెడీ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్(Save the Tigers) ట్రైలర్‌ను మేకర్స్ గురువారం విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్‌లో అభినవ్ గోమతం, ప్రియదర్శి, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేశారు. సేవ్ ది టైగర్స్ ఏప్రిల్ 27న డిస్నీ + హాట్‌స్టార్(disney plus hot star)లో విడుదల కానుంది. ప్రదీప్ అద్వైతం రాసిన ఈ వెబ్ సిరీస్‌కి తేజ కాకుమాను దర్శకత్వం వహిస్తున్నారు.
Prabhas : ఈ న్యూస్ వింటే.. అరె ఆదిపురుష్ ఎంత పని చేశాడు? అని అనిపించక మానదు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ప్రభాస్‌కు ఒక సాలిడ్ హిట్ పడాలని కోరుకుంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అలా జరగాలంటే.. ప్రభాస్ అప్ కమింగ్ సినిమాలు థియేర్లోకి వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu) తన ఫ్యామిలీతో కలిసి మళ్లీ ఫారెన్ టూర్ వెళ్లారు. ఈ క్రమంలో ప్యారిస్ వీధుల్లో తన కుమార్తెతో కలిసి ఎంజాయ్ చేస్తున్న చిత్రాలతోపాటు ఇంకొన్ని ఫొటోలను తన ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు.
హీరో రాఘవ లారెన్స్(Raghava Lawrence) మరోసారి మంచి మనసుని చాటుకుని వార్తల్లో నిలిచారు. 150 మంది చిన్నారులను దత్తత తీసుకుని వారి చదువుకు పూర్తిగా సహకారం అందిస్తానని ఇటీవల ప్రకటించాడు. ఈ మేరకు తాను యాక్ట్ చేసిన రుద్రుడు మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమంలో భాగంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇది తెలిసిన అభిమానులతోపాటు పలువురు సెలబ్రీటీలు రాఘవ చేసిన పనికి మెచ్చుకుంటున్నారు.