Venkatesh shared another heroine pic in Saindhav movie
Saindhav heroine:హీరో వెంకటేష్ (venkatesh)- శైలేష్ కొలను (sailesh kolanu) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సైంధవ్ (Saindhav).. ఈ సినిమా గురించి మరో అప్ డేట్ ఇచ్చింది మూవీ టీమ్. సినిమాలో ఫీమెల్ లీడ్ క్యారెక్టర్ శ్రద్దా శ్రీనాథ్ (shraddha srinath) పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ గురించి టీమ్ ప్రకటన చేసింది. మూవీలో డాక్టర్ రేణు (doctor renu) అనే పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. ఆ రోల్‌ను రుహానీ శర్మ (Ruhani sharma) చేయనున్నారు. ఈ మేరకు హీరో వెంకటేష్ (venkatesh) ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
సైంధవ్.. సైకో థ్రిల్లర్ మూవీగా రూపొందుతుంది. సినిమాలో డాక్టర్ రేణు (renu) కీలక పాత్ర పోషిస్తారు. ఆ పాత్రకు రుహానీని (ruhani) ఎంపిక చేశారు. ఈమె చిలసౌ అనే మూవీలో నటించి.. మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు మరో కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చింది.
సైంధవ్ వెంకటేష్ (venkatesh) 75వ సినిమా.. రిలీజ్ చేసిన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. మూవీలో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దికీ కీ రోల్ పోషిస్తున్నారు. నాచురల్ స్టార్ నాని (nani) కూడా యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. ఇటీవల జరిగిన నాని- శైలేష్ చిట్ చాట్ ద్వారా తెలిసింది.
ఈ డిసెంబర్ 22వ తేదీ తెలుగు (telugu), తమిళం (tamil), మలయాళం (malayalam), కన్నడ (kannada), హిందీలో (hindi) సైంధవ్ (saindhav) మూవీ రిలీజ్ కానుంది. హీరో వెంకటేష్ కెరీర్లో ఇదీ తొలి పాన్ ఇండియా (pan india movie) మూవీ.. డైరెక్టర్ శైలేష్ కొలను (sailesh kolanu) కూడా ఇదీ పెద్ద ప్రాజెక్ట్. సైకో థ్రిల్లర్ మూవీస్‌తో శైలేష్ మంచి పేరు తెచ్చుకున్నారు. హిట్: ద ఫస్ట్ కేసు మూవీకి మంచి టాక్ వచ్చింది. హిట్: ద సెకండ్ కేసు ఆశించిన స్థాయిలో ఆడలేదు.