బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు కదా.. రోజు రోజుకి పెరుగుతునే ఉంది. ఎందుకంటే.. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఇండియాలో ఏ హీరోకి లేనన్ని భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె.. ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నాయి. అలాగే మారుతి సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ ఎలాగూ లైన్లో ఉంది. వీటిలో ముందుగా ఆదిపురుష్ థియేటర్లోకి రాబోతోంది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 16న రిలీజ్ చేయబోతున్నారు. మరోసారి పోస్ట్ పోన్ అవనుందని వార్తలొస్తున్నా.. ఇంకా దానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం డైరెక్టర్ ఓం రౌత్.. ఆదిపురుష్ గ్రాఫిక్స్ పనులతో బిజీగా ఉన్నాడు. టీజర్ పై వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకొని.. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ చేత ఓ భారీ డైలాగ్ చెప్పించాడట ఓం రౌత్. ఈ సినిమాలో రాముడి పాత్ర, ఆలోచనా విధానాన్ని చెప్పడానికి.. రెండు పేజీల ఓ భారీ డైలాగ్ రాశారట. ఇప్పటివరకు ప్రభాస్ తన కెరీర్లో అంత పెద్ద డైలాగ్ ఏ సినిమాలో చెప్పలేదు.. కానీ ఫస్ట్ టైం ఆదిపురుష్ కోసం ప్రభాస్ అతి పెద్ద డైలాగ్ ను చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో విమర్శలకు చెక్ పెడుతూ.. ఆదిపురుష్ను గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుండగా.. రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.. లక్ష్మణుడిగా బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నాడు. మరి ఆదిపురుష్ ఎలా ఉంటుందో చూడాలి.