ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర ఉన్న డాన్ ప్లేస్‌లో కొత్త డాన్ వచ్చాడు. యాక్టర్ కమ్ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ 'డాన్ 3' మూవీని అనౌన్స్ చేసాడు. చాలా కాలంగా ఈ మూవీ అనౌన్స్మెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫాన్స్ కిక్ ఇస్తూ.. షారుఖ్ ప్లేస్‌లో కొత్త హీరోతో డాన్ 3ని అనౌన్స్ చేసాడు ఫర్హాన్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో అదిరిపోయింది.
అసలు డాన్ ఫ్రాంచైజ్‌ని బాలీవుడ్ బాద్షా షారుఖ్ లేకుండా ఊహించడం కష్టమే. డాన్ అంటే ఇలానే ఉంటాడేమో అనేలా.. షారుఖ్ ఖాన్ని ఓన్ చేసుకున్నారు మూవీ లవర్స్. అందుకే మరోసారి షారుఖ్ డాన్‌గా కనిపిస్తే చూడాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు షారుఖ్ డాన్‌గా తప్పుకున్నాడు. అతని ప్లేస్‌లో కొత్త డాన్ వచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేశారు మేకర్స్. షారుఖ్ ప్లేస్‌లో రణ్వీర్ సింగ్ హీరోగా ‘డాన్ 3’ సినిమా అనౌన్స్ చేశాడు ఫర్హాన్ అక్తర్.
ఈ వీడియోలో రణవీర్ సింగ్ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. రణవీర్ డైలాగ్‌తో స్టార్ట్ అయ్యి, వీడియో లాస్ట్‌లో అతని ఫేస్ రివీల్ అయింది. ఈ అనౌన్స్మెంట్ వీడియోకి ట్రేడ్ మార్క్ డాన్ థీమ్ మ్యూజిక్ కూడా అటాచ్ చేయడంతో.. డాన్ లవర్స్‌కి గూస్ బంప్స్ వస్తున్నాయి. లైటర్‌తో సిగరఎట్ వెలిగించుకుంటూ.. అలా స్టైలిష్‌గా నడిచి వస్తున్నాడు డాన్. అయితే డాన్‌గా రణ్వీర్ సింగ్ బాగానే ఉన్నాడు కానీ.. షారుఖ్ రేంజ్ ఇంపాక్ట్ ఉంటుందా? అంటే ఖచ్చితంగా కాదనే అంటున్నారు. అందుకే.. షారుఖ్ లేని డాన్3 వద్దని సోషల్ మీడియాలో కొందరు ట్రెండ్ చేస్తున్నారు. ఇక దాదాపు పుష్కర కాలం తర్వాత మెగా ఫోన్ పడుతున్నాడు ఫర్హాన్ అక్తర్.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది చివరి కల్లా షూటింగ్‌ను పూర్తి చేసి.. 2025లో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రితేష్ సిద్వాని, ఫర్హన్ అక్తర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రూపొందుతుంది. మరి డాన్ 3 ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.