Hit tv exclusive interview with INDIAN IDOL FINALIST SINGER KARTHIKEYA
KARTHIKEYA: ఎంత సక్కగున్నావో పాటతో మంచి పేరు తెచ్చుకున్నారు ప్లే బ్లాక్ సింగర్ కార్తీకేయ (KARTHIKEYA). ఆయన తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ కూడా.. కార్తికేయతో హిట్ టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ చేసింది. సంగీతం అంటే చిన్నప్పటి నుంచే ఇష్టమని, 4,5 ఏళ్ల నుంచి నేర్చుకున్నాడని అతని తల్లి శారదమ్మ తెలిపారు. యూకేజీ నుంచి మ్యూజిక్ క్లాసులకు పంపించానని గుర్తుచేశారు. సంగీతం అంటే ఇష్టం, గౌరవం అని.. నేర్పిస్తే ఏ రోజు వద్దనలేదు అని.. ఇప్పటికీ నేర్చుకుంటాడని తెలిపారు.
చదవండి: 22 Web Series: ఈ వారం ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే వెబ్ సిరీస్, సినిమాలు
మల్లాది గాయత్రి వద్ద సంగీతానికి ఓనమాలు నేర్చుకున్నాడని శారదమ్మ తెలపారు. ఫస్ట్ పాడిన పాట ‘అన్నీ మంత్రములు ఇందే అవహించెను. వెన్నతో నాకు కలిగే వెంకటేషు మంత్రము’ పాడారు. బోల్ బేబీ బోల్తో స్టేజీ షో చేసే అవకాశం లభించింది. కోటి, సునీత లాంటి వారు సలహాలు, సూచనలు అందజేశారని తెలిపారు. ఇక్కడ యాంకర్‌గా చేసిన హేమ చందర్ చక్కగా పాడేవాడని గుర్తుచేశారు. పాడుతా తీయగా జీవితంలో అచివ్ మెంట్ అని చెబుతున్నారు. బాలు, కార్తీక్, హరిచరణ్, శంకర్ మహాదేవన్ పాటలు వినేవాడినని తెలిపారు.
అడిషన్స్‌లో ‘యమహా నగరి కోల్ కతా పురి’ పాట పాడానని కార్తీకేయ వివరించారు. పాడుతా తీయగాలో క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్ వరకు వెళ్లానని తెలిపారు. ‘జగమే మారినది మధురంగా ఈ వేళ, కలలు, కోరికలు తీరినవి, మనసారా’ అనే పాటను పాడుతా తీయగాలో పాడానని గుర్తుచేశారు. పాత పాటలు పాడితే అమ్మ, అత్తయ్య సంతోషపడేవారని శారదమ్మ వివరించారు. ఆరెంజ్ మూవీలో ‘చిలిపిగా చూస్తావా అలా.. నిన్నే ఆపేదేలా సాంగ్ పాడి వినిపించారు.

