ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. ఈరోజు మీరు ప్రతి పనిని తెలివిగా, విచక్షణతో చేస్తారు. మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన విరుద్ధంగా ఉంటుంది. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలొస్తాయి. ఈరోజు మీ భాగస్వామ్య పనిలో ఎలాంటి పెట్టుబడి పెట్టొద్దు. ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది.
వృషభ రాశి :
ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు చాలా ఓపికగా పని చేయాలి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు అధిక పనిభారం కారణంగా మీరు అలసిపోవచ్చు. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
మిధున రాశి :
ఈ రాశి వారికి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులకు ఆర్థిక ప్రయోజనాలు మంచిగా ఉంటాయి. మీ వైవాహిక జీవితంలో ఏదైనా మనస్పర్దలు రావొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలు తప్ప మీ ఆరోగ్యం బాగుంటుంది
కర్కాటక రాశి :
ఈ రాశి వారు ఈరోజు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు ఏదైనా పని చేసే ముందు లాభనష్టాల గురించి ఆలోచిస్తారు. ఈరోజు సమస్యాత్మకమైన పనులను దూరంగా ఉండాలి.
సింహ రాశి :
ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాల్లో గందరగోళంగా ఫీలవుతారు. మీ మనసులో కొన్ని ప్రతికూల ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా మీ పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలొస్తాయి.
కన్య రాశి :
ఈ రాశి వారు ఈరోజు పనులన్నీ చాలా జాగ్రత్తగా చేయాలి. ఈరోజు వినోదం గురించి ఖర్చులు ఎక్కువగా చేయొచ్చు. ఈ కారణంగా మీరు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవచ్చు. ఉద్యోగులకు సహోద్యోగుల కారణంగా పెద్ద ప్రయోజనాలు దక్కకుండా పోవచ్చు. ఈరోజు మీరు అప్పులు చేయాల్సి రావొచ్చు. మీ ఇంట్లో తల్లితో మనస్పర్దలు రావొచ్చు.
తుల రాశి :
ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. ఈరోజు ఎవరితోనై విభేదాలతో పాటు శత్రుత్వం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు ఆదాయం విషయంలో స్థిరత్వం ఉండదు. మహిళలతో మాట్లాడే సమయంలో చిన్న విషయాలకే విభేదాలు రావొచ్చు. ఆరోగ్య పరంగా సాధారణంగా ఉంటుంది.
వృశ్చిక రాశి :
ఈ రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ పనికి సంబంధించి కొన్ని ప్రయోజనాలను పొందుతారు. ఈరోజు చాలా వరకు వైఫల్యాలను ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ ఇంట్లో ఖర్చులకు సంబంధించి పరస్పర విభేదాలు తలెత్తుతాయి.
ధనస్సు రాశి :
ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో ఆందోళన ఉంటుంది. మీరు అనుకున్న పనులు చేయలేకపోతారు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగులు మీరు చేసే పనులను కాదని అదనపు పనులను మీద వేయొచ్చు. ఈరోజు చిన్న ప్రయాణాలను చేయొచ్చు.
మకర రాశి :
ఈ రాశి వారు ఈరోజు తమ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారులు ఈరోజు లాభాలను ఆశించొద్దు. వ్యాపారులు ఖర్చులకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈరోజు మతపరమైన పనుల పట్ల విధేయత కలిగి ఉంటారు.
కుంభ రాశి :
ఈ రాశి వారిలో వ్యాపారులు ప్రారంభం నుంచి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఆర్థిక పరంగా మంచి లాభాలొస్తాయి. మీకు ఆరోగ్య పరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి :
ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. వ్యాపారం గురించి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటారు. మరోవైపు మీకు ఆర్థిక పరమైన విషయాల్లో లాభాలొస్తాయి.