నవరాత్రి సందర్భంగా దుర్గామాతను వివిధ రూపాల్లో అలంకరించి భక్తులు పూజిస్తూ ఉంటారు. అయితే కోల్‌కతాలో మాత్రం వెరైటీగా తమ భక్తిని చాటుకుంటుంటారు. తాజాగా అక్కడ పానీపూరీలతో దుర్గామాత మండపాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ మండపానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తిరుమలకు వెళ్లేవారికి గంటలోపే శ్రీవారి దర్శనం అవుతోంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా డైరెక్ట్‌గా క్యూలైన్లలోకి పంపడం వల్ల వేగంగా దర్శనం పూర్తవుతోందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. 23న చక్రస్నానంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.
పది రోజుల పాటు జరిగే మైసూరు దసరా ఉత్సవాలు ఆదివారం సాంస్కృతిక నగరం చాముండి హిల్స్‌లో ప్రారంభమయ్యాయి. ప్రముఖ సంగీత దర్శకుడు హంసలేఖ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించగా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(siddaramaiah) కూడా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.
రేపటి (అక్టోబర్ 14న) సూర్య గ్రహణం(solar eclipse) భారతదేశంలో కనిపించదు. కానీ దీనికి ఓ ప్రత్యేకత ఉందని జ్యోతిషశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రత్యేకతలు ఎంటీ? దీని కారణంగా ఏదైనా సంభవించనున్నాయా అనేది ఇప్పుడు చుద్దాం.