»Kalki Dham Modi Laid The Foundation Stone Of Kalki Dham Temple
Kalki Dham: కల్కీ ధామ్ ఆలయానికి శంకుస్థాపన చేసిన మోదీ
ఉత్తరప్రదేశ్లోని సంబల్ జిల్లాలో కల్కీ ధామ్ ఆలయానికి ఈరోజు ప్రధాన మోదీ శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానితో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.
Kalki Dham: ఉత్తరప్రదేశ్లోని సంబల్ జిల్లాలో కల్కీ ధామ్ ఆలయానికి ఈరోజు ప్రధాన మోదీ శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానితో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. కల్కి ధామ్ నిర్మాన్ ట్రస్టు కల్కి ధామ్ ఆలయాన్ని నిర్మిస్తుంది. ఈ ట్రస్టు చైర్మన్ ప్రమోద్ కృష్ణమ్. ఆలయం శంకుస్థాపన తర్వాత ప్రధాని మోదీ ప్రసంగించారు. సాధువుల భక్తి, ప్రజల స్పూర్తి వల్లే కల్కి ఆలయ నిర్మాణానికి నాంది పడిందన్నారు.
#WATCH | PM Modi says "…It is during this period that we have seen Vishwanath Dham flourishing in Kashi. During this period we are witnessing the rejuvenation of Kashi. It is during this period that we have seen the glory of Mahalok of Mahakaal. We have seen the development of… pic.twitter.com/Aj2wE5CYja
పెద్ద పెద్ద సాధువులు, ఆచార్యుల సమక్షంలో తాను శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. భారతీయ విశ్వాసాలకు కల్కి ధామ్ కేంద్ర బిందువుగా మారుతుందన్నారు. మోదీ హయాంలోనే కాశీలోని విశ్వనాథ్ థామ్ అభివృద్ధి జరిగిందన్నారు. ఉజ్జయినిలో మహాకాల్ ఆలయ అభివృద్ధి కూడా జరిగిందన్నారు. ఈ కాలంలోనే సోమనాథ్, కేదార్నాథ్ డెవలప్మెంట్ జరిగిందన్నారు. అభివృద్ధితో పాటు వారసత్వ మంత్రాన్ని అవలంబిస్తున్నామన్నారు.
ఒకవైపు దైవక్షేత్రాలను అభివృద్ది చేస్తున్నామని, మరో వైపు నగరాల్లో హైటెక్ మౌళికసదుపాయాల్ని కల్పిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఆలయాలను పునర్ నిర్మించడంతో పాటు దేశవ్యాప్తంగా వైద్యశాలలను కూడా కట్టిస్తున్నామన్నారు. విదేశాల్లో మన పూర్వీకుల శిల్పాలను తెప్పిస్తున్నామని, అలాగే విదేశీ పెట్టుబడులు కూడా రికార్డు స్థాయిలో వస్తున్నాయన్నారు.