మేషం
నూతన కార్యక్రమాలను చేపడతారు. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధుమిత్రులతో శత్రుత్వం ఏర్పడకుండా జాగ్రత్తవహించాలి.
వృషభం
మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.తలపెట్టిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది.
మిథునం
బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఫ్యామిలీ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.
కర్కాటకం
ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో సహనంవహించక తప్పదు.
సింహం
పట్టువదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. కొందరి వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్తపడటం మంచిది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి.
కన్య
మీరు అనుకున్న విషయాలలో మంచి ఫలితాలు సాధిస్తారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు.మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభిరవృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు.
తుల
బిజినేస్లో లాభాలు ఉంటాయి. శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ప్రయత్నం మేరకు స్వల్పలాభం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.. గొప్ప సంకల్పబలంతో తలపెట్టిన పనులను పూర్తిచేస్తారు. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి.
వృశ్చికం
ప్రతి చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. చేపట్టిన పనులలో పురోగతి ఉంటుంది. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశంవల్ల కొన్ని పనులు చెడిపోతాయి.
ధనుస్సు
ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది.కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిరనివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు.తలపెట్టిన కార్యాలు ఫలిస్తాయి..
మకరం
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కొత్త వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు.
కుంభం
మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శారీరక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది.
మీనం
పెద్దలు సూచించిన మార్గంలో ముందుకు సాగితే మంచి ఫలితాలు లభిస్తాయి. కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.