మేషం
నూతన వ్యాపారాన్ని ప్రారంభించడంలో సమస్యలు ఎదురవుతాయి. కార్యాలయ పనుల కారణంగా అనవసరంగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు.అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.కుటుంబ సభ్యులతో విభేదాలు పెరగవచ్చు వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి.
వృషభం
మీరు ఉద్యోగంలో ప్రశాంతత పొందుతారు. కాస్త ఓపికగా వ్యవహరించండి. ఎంత బిజీగా ఉన్నప్పటికీ మీ పనికి ప్రాధాన్యత ఇస్తారు. సరైన వ్యక్తుల నుంచి మార్గదర్శకత్వం పొందుతారు.నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మలన్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు.
మిథునం
ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది.మీ సరైన చర్యలను కూడా వ్యతిరేకించేవారున్నారు. మీ మనసులో ఎవరిపట్లా శత్రుత్వం పెట్టుకోవద్దు.
కర్కాటకం
విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీరు జీవిత భాగస్వామితో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. పాత సమస్యల నుంచి బయటపడతారు.
సింహం
ప్రతి పరిస్థితిలో సానుకూలంగా ఉండండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. అదనపు ఖర్చులు పెరుగుతాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
కన్య
మీ శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు ధనలాభానికి కొత్త వనరులు లభిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.పొందుతారు.
తుల
మీరు ఉద్యోగం మారే ఆలోచన ఉంటే ప్రస్తుతానికి వాయిదా వేసుకోడమే మంచిది. వ్యాపారంలో ముఖ్యమైన లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నించాలి.స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం పొందుతారు.ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
వృశ్చికం
మీరు చదువులో మంచి ఫలితాలు పొందుతారు.ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించక తప్పదు.కోపంతో ఉన్న స్నేహితులను కూల్ చేసేందుకు ప్రయత్నించాలి.
ధనుస్సు
ఆర్థిక పురోగతి సాధించడానికి చేసే శ్రమ ఫలిస్తుంది.అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు.ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది.పొరుగువారితో కొంత వాగ్వాదం ఉండవచ్చు. చదువుపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక పురోగతి సాధించడానికి చేసే శ్రమ ఫలిస్తుంది.
మకరం
మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం కేటాయించినప్పుడే మీ బంధం పటిష్టమవుతుంది. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి.ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉంది.
కుంభం
ఎంతో కాలంగా మీలో ఉన్న కోరిక ఈ రోజు నెరవేరుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. మీరు మీ సామర్థ్యాలను సరిగ్గా ఉపయోగించుకోవాలి. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి.
మీనం
ఈ రాశివారికి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ ప్రవర్తనను మధురంగా ఉంచుకోండి. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు.ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.