మేషం
మీరు చేసే ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్తారు.మీ ప్రత్యర్థుల ఎత్తుగడలు అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి.ఒత్తిడి తగ్గుతుంది.
వృషభం
ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు. అనుకున్న పనులన్నీ ఈరోజు పూర్తవుతాయి. రాజకీయ రంగాలకు సంబంధించిన వ్యక్తుల సర్కిల్ పెరుగుతుంది. మీరు విలువైన వస్తువును బహుమతిగా అందుకోవచ్చు.మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి.
మిథునం
మీ లక్ష్యాలలో ఏదైనా సాధించవచ్చు.మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించడం వల్ల మీరు ఒత్తిడికి లోనవుతారు. విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్తవహించబడం మంచిది. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
కర్కాటకం
గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. విదేశాలలో వ్యాపారం చేసేవారికి లాభాలొస్తాయి. మీరు మీ ముఖ్యమైన పనులకు మంచి మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు. బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం మంచిది. మీ ప్రతిష్ట పెరుగుతుంది. అహంకారం తగ్గించుకోవాలి. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.
సింహం
మీ జీవితంలో విషయంలో పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి మీరు ఉపశమనం పొందుతారు. మీ సోదరులతో ఏదైనా సమస్యపై మాట్లాడవచ్చు. విద్యార్థులు ఏ పరీక్షలోనైనా విజయం సాధించడానికి అన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు.
కన్య
మీరు రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్యప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయండి. కార్యాలయంలో అనుకున్న పనిని సమయం కన్నా ముందే పూర్తిచేస్తారు. ఈ రోజు మీకు శుభవార్త అందుతుంది. మీరు స్నేహితుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు.
తుల
ఈ రోజు మీకు చాలా మంచి రోజు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం గురించి జాగ్రత్తపడటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు.
వృశ్చికం
మీరు నూతన కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి
ధనుస్సు
ఈ రోజు మీకు ముఖ్యమైన రోజు కానుంది. భాగస్వామ్యంతో కొన్ని పనులు చేస్తే బాగుంటుంది. మీరు మీ సహోద్యోగులను విశ్వసిస్తారు. ముఖ్యమైన పత్రాలపై నిఘా ఉంచడం ద్వారా ప్రభుత్వ పనిని కొనసాగించండి లేదంటే మీరు మోసపోవచ్చు.పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది.
మకరం
ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు.ఏదైనా వ్యాపార సంబంధిత విషయం మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతూ ఉంటే, మీరు దాన్ని పరిష్కరించగలరు. ఉద్యోగాలలో పని చేసే వ్యక్తులు కొంత పురోగతి గురించి వార్తలు వినవచ్చు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణబాధలు తొలగిపోతాయి.
కుంభం
ఈ రోజు మీకు ముఖ్యమైన రోజు కానుంది. అవసరమైన సమాచారం అందుతుంది. కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు. మీరు మెరుగ్గా పని చేస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పని ఈ రోజు ఊపందుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వ్యక్తులు మరింత కష్టపడాల్సి ఉంటుంది.అపకీర్తి రాకుండా జాగ్రత్తపడటం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.
మీనం
ఈ రోజు మీకు సౌకర్యాలు పెరుగుతాయి. నూతన నిర్ణయాలు తీసుకునేందుకు తొందరపడకండి లేదంటే కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. బాధ్యతాయుతమైన పనిని పొందుతారు. గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు.