మేషం
ఈ రోజు మీరు శుభ వార్తలు వింటారు.నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు.కొన్ని సమస్యలపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. మీ ఆలోచనా విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది.ఆస్తి కొనుగోలు ఆలోచన ఉంటే కొన్నిరోజులు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.
వృషభం
మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు..ఆదాచేయాలి అనుకున్నా కష్టమే. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగేసేందుకు ఇదే శుభ సమయం. ఉద్యోగం, వ్యాపారంలో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు ఇదే మంచి టైమ్ అని గుర్తుంచుకోండి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి. వృధాప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది.
మిథునం
మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది..దీర్ఘకాలంలో ఇది మీ బంధానికి అంత మంచిది కాదు. ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా బంధం పటిష్టం అవుతుందని గుర్తించండి. ఉద్యోగం, వ్యాపారంలో కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.
విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తవహించడం మంచిది. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
కర్కాటకం
ఈ రోజు మీరు కెరీర్ సంబంధిత విషయాలలో శుభవార్త వింటారు. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. కొన్ని విషయాలపై సానుకూలంగా వ్యవహరించండి. మిమ్మల్ని మీరు నమ్మితే విజయం సాధిస్తారు. సహనంగా వ్యవహరిస్తే ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేస్తారు. విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతనకార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
సింహం
మీ కుటుంబంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా మీరు చేసిన తప్పులు అంగీకరించడం ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు చెప్పాలి అనుకున్న విషయం స్పష్టంగా చెప్పడం మంచిది. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. మీరు విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
కన్య
తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.మీరు చేసే పనిని మెరుగుపర్చుకోవడంలో సహోద్యోగుల నుంచి మద్దతు తీసుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్యలను వృత్తికి లింక్ చేయడం అంత మంచిది కాదు. మీ చుట్టూ ఉండేవారిలో మిమ్మల్ని మోసం చేసేవారున్నారు జాగ్రత్త. డబ్బుకు సంబంధించిన విషయాలపై శ్రద్ధ అవసరం. ముఖ్యమైన నిర్ణయం తీసుకునేందుకు ఆలోచించాలి. అవసరమైన విశ్రాంతి తీసుకోవడం మీకు చాలా అవసరం.
తుల
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.మీరు పనిలో ఒత్తిడి తగ్గించుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. అదృష్టం కలిసొస్తుందకి. ఆత్మవిశ్వాసం తగ్గనీయవద్దు. మీ లక్ష్యం విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తే విజయం తథ్యం. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలి. మీ కలను నిజం చేసుకునే ప్రయత్నం చేయండి.
వృశ్చికం
మీరు చేసే వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి.మీ భాగస్వామితో మంచి సమయం స్పెండ్ చేస్తారు. మీ వృత్తిపరమైన జీవితానికి సంబంధించి పెద్ద మార్పులు జరగబోతున్నాయి. మీరు చేసిన కృషి మరియు అంకితభావం ఫలిస్తుంది. ఆర్థిక నష్టాలకు దూరంగా ఉండాలి.
ధనుస్సు
ఈ రాశివారు కష్టపడి పనిచేస్తేనే ఫలితం ఉంటుంది. కొత్త అవార్డులు, రివార్డులు అందుకుంటారు.డబ్బు పొదుపు చేయడం ప్రారంభించాలి. ఊహించని ఖర్చులుంటాయి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఉద్యోగులు సహోద్యోగుల నుంచి సహకారం తీసుకోవాలి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి.
మకరం
ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి మీ మాట వినడానికి బదులు తన మనసులోని మాటను చెప్పడానికి ఇష్టపడతారు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఈ రోజు ఆర్థిక విషయాల్లో తొందరపాటు వద్దు. ఎవ్వరి దగ్గరా డబ్బులు తీసుకోవద్దు..ఇవ్వొద్దు. మీ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది.
కుంభం
అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో శత్రుత్వం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు.సానుకూల ఆలోచనలతో ఉంటారు. అర్థవంతమైన సంభాషణలో పాల్గొంటారు. మీ మనసు తెలియజేసేందుకు కొత్త బంధాలు ఏర్పరుచుకునేందుకు ఇదే మంచి సమయం. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోడానికి సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఈ రోజు వచ్చే అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ భవిష్యత్ కి కొత్త మార్గాలు ఏర్పడతాయి.
మీనం
ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్తారు. మీకు మంచి సక్సెస్ ను ఇస్తుంది. ఆర్థిక ప్రణాళికలు సరిగ్గా వేసుకోకుంటే రానున్న రోజుల్లో నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ ఆలోచనల్లో ఏకాగ్రత అవసరం.
చదవండి : Nani:మీ ఓటు నాకే అంటున్న హీరో!