»Horoscope Today Todays Horoscope December 5th 2023 Good News Will Be Heard
Horoscope Today : నేటి రాశిఫలాలు(December 5th 2023)..శుభవార్తలు వింటారు
ఈ రోజు(December 5th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి.
మేషం:
ఈ రాశివారికి ఆర్థిక వ్యవహారాలు బావుంటాయి. అయితే అన్నిచోట్లా కొద్దిగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఇంటా బయట చికాకులు తప్పవు.
వృషభం:
ఈ రాశివారికి కుటుంబంలో ఒత్తిడి అధికాంగా ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. వ్యాపారాల్లో లక్ష్యాలను పెంచుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగ అవకాశాలు ఫలిస్తాయి. సన్నిహితులకు ఆర్థికంగా సాయం చేస్తారు. మనసు నిలకడగా ఉండదు. మౌనంగా ఉండటం మంచిది.
మిథునం:
ఈరాశివారికి ఇది అనుకూల సమయం. ఉద్యోగంలో బాధ్యత పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు బావుంటాయి. ఉద్యోగులకు ఒత్తిడి ఉంటుంది. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. ఆరోగ్యం పర్వాలేదు. ఆదాయం స్థిరంగా ఉంటుంది.
కర్కాటకం:
ఈ రాశివారికి ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహానికి సంబంధించి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. బంధువుల నుంచి సహాయాలు అందుతాయి. వ్యాపారాల్లో కాస్త ఇబ్బందులు ఉంటాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయం స్థిరంగా కొనసాగుతుంది.
సింహం:
ఈ రాశివారికి ఆర్థిక లావాదేవీలు బావుంటుంది. అనుకోకుండా ధనం చేతికి అందుతుంది. కుటుంబీకుల సలహాలు తీసుకుంటారు. ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉంటే మంచిది. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయం పర్వాలేదు.
కన్య:
ఈ రాశివారికి ఇదే మంచి సమయం. వ్యాపారాల్లో లాభాలు అధికంగా ఉంటాయి. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాలను అనుకోకుండా వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తొందర పాటు నిర్ణయాలు తీసుకోకండి. కోపాలను కంట్రోల్ చేసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారాలు లభిస్తాయి.
తుల:
ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఉద్యోగాల్లో ఒత్తిడి తప్పదు. బాధ్యతలను పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆదాయం స్థిరంగా కొనసాగుతుంది. ఖర్చులు భారీగా పెరుగుతాయి. స్నేహితులు ఇబ్బంది పెడతారు. అనుకున్నవన్నీ నెరవేరే అవకాశం ఉంది. ఆరోగ్యం బావుంటుంది.
వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకున్న పనులు పూర్తి అవుతాయి. కొత్తవారితో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల వల్ల వ్యక్తిగత సమస్యలు తీరుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ముందు కంటే కాస్త మెరుగవుతుంది. పాత బాకీలు వసూలు చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. చికాకులు తప్పవు.
ధనుస్సు:
ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో ఉత్సాహం మరింత పెరుగుతుంది. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇతరులకు సాయం చేస్తారు. అన్నిచోట్లా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం పర్వాలేదు.
మకరం:
ఈ రాశివారికి ప్రశాంత వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు బావుంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది. ఏది తలపెట్టిన అందులో విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.
కుంభం:
ఈ రాశివారికి సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబం నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రతిభకు, శ్రమకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆదాయం బావుంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
మీనం:
ఈ రాశి వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా భారీగా ఉంటాయి. వ్యాపారాల్లో కొత్త ప్రయత్నాలు మొదలెడతారు. అధికారుల నుంచి ప్రతిఫలం పొందుతారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆచితూచి వ్యవహరించడం మంచిది.